2025లో అదృష్టం కలిసిరావాలా.. ఈ పండ్లు తినాల్సిందేనంట!
TV9 Telugu
Pic credit - Pixabay
న్యూ ఇయర్ వచ్చేసింది. ఈ 2025లో సంతోషంగా ఉండాలని కొందరు అనుకుంటే, ఇంకొంత మంది తమ కలలను నెర వేర్చుకోవాలి అనుకుంటారు.
కానీ అందరూ తమ కలను నెరవేర్చుకుంటారా? అంటే కొంత మంది మాత్రమే తాము అనుకున్నది చేసి సక్సెస్ అవుతారు.
దాని కోసం కొందరు ప్రత్యేకంగా ఓ ప్రణాళిక రూపొందించుకోగా, ఇంకొంత మంది ఆధ్యాత్మికంగా,మరికొంత మంది కష్టపడుతూ ఉంటారు.
కానీ 12 ద్రాక్ష పండ్లను తినడం ద్వారా సంవత్సరం అంతా ఆనందంగా, అనుకున్నది నెరవేర్చుకోవచ్చు అని మీకు తెలుసా?
ఏంటీ ఇదో కొత్త సంప్రదాయం అనుకుంటున్నారా? అవునండీ, స్పానిష్ సంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం రోజున 12 ద్రాక్ష పండ్లను తినడం ద్వారా ఆ ఇయర్ మొత్తం వారికి అదృష్టమేనంట
దీనికి ఓ ప్రత్యేక నియమం కూడా ఉంది. అది ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా న్యూ ఇయర్ నైట్ 12కి 12 ద్రాక్ష పండ్లు తినాలంట
ఇలా చేయడం వలన వారికి ఆనందం, ఐశ్వర్యం, చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుందని వారి నమ్మకం.
ఈ వింత సంప్రదాయం స్పానిష్‌లో 19వ శతాబ్దంనుంచి అక్కడి వారు అనుసరిస్తున్నట్లు సమాచారం.