విమానాల్లో ఏ సీటు సేఫ్..
TV9 Telugu
31 December
2024
దక్షిణ కొరియాలోని ముయాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అంతకు కొన్ని రోజుల ముందు కజకిస్థాన్‌లో ప్రమాదం జరిగింది.
ఈ రెండు ప్రమాదాల్లో వెనక సీట్లలో కూర్చొన్నవారే సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పుడు విమానాల్లో ఏ సీట్లు సురక్షితమైనవి అనే చర్చ మొదలైంది.
వెనకవైపు ఉండే సీట్లలో మరణాల రేటు కేవలం 32%, మధ్యభాగంలో అత్యధికంగా 39%, ముందు సీట్లలో కొంచెం తక్కువగా 29% ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
2012లో మెక్సికోలో ఓ బృందం విమానంలో డమ్మీలను అమర్చి కూల్చారు. ముందు సీట్లలోని ప్రయాణికులు మృతి చెందినట్లు గుర్తించారు.
ఇక రెక్కలకు సమాంతరంగా ఉన్న సీట్లోని వారు గాయాలతో బయటపడ్డారనీ వెనక సీట్లలోని వారు స్వల్పగాయాలతో బయటపడే అవకాశం ఉందని అంచనా వేశారు.
అయితే ఇవన్నీ కొన్నిరకాల ప్రమాదాలకు, పరిస్థితులకు మాత్రమే వర్తిస్తాయి. అన్ని సమయాల్లో కూడా ఇవి పని చెయ్యవు.
ఎందుకంటే విమానంలో ఎక్కువ, తక్కువ సురక్షితమైన ప్రదేశాలంటూ ఉండవని అన్ని ఒకేలా ఉంటాయని ఎఫ్‌ఏఏ చెబుతోంది.
మొదట తోక భాగం నేలను తాకితే అక్కడి వారు ప్రాణాలు కోల్పోవచ్చు. క్రూ బృందం సూచనలు కచ్చితంగా పాటించి కొంతమేరకు ప్రమాదాలు తప్పించుకోవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పిల్లలు 18+ కంటెంట్‌ను చూడకుండా నిరోధించడం ఎలా.?
ఈ సింపుల్ టిప్స్‌తో ఫోన్లో యాడ్స్ బ్లాక్..
యాపిల్ వినియోగదారులకు అలెర్ట్.. CERT-In హెచ్చరికలు..