సీక్వెల్‌గా ఆ బాలీవుడ్ క్రేజీ మూవీస్..
04 January
202
5
Battula Prudvi
తెలియని కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తే... ముందు దాన్ని జనాల్లోకి ఇంజెక్ట్ చేయాలి. అదే తెలిసిన కాన్సెప్టులతో చేసే మూవీస్ అయితే. బేఫికర్‌గా ఉండొచ్చు.
అందులోనూ ప్రేక్షకులు ఎంతగానో కావాలనుకున్న సినిమాలైతే.. సమస్యే లేదు. అందుకే పాత ప్రాజెక్టులకు దుమ్ముదులుపుతున్నారు నార్త్ మేకర్స్.
కిక్ సినిమాకు సీక్వెల్ కావాలని మీరెంతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అందుకే నేను కూడా ఆ పనిలోనే ఉన్నాను అని అంటున్నారు సల్మాన్ ఖాన్.
ఆయన ఆల్రెడీ కిక్ సీక్వెల్ స్క్రిప్ట్ ని ఫాలో అప్ చేస్తున్నారట. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్దాం అని ఫ్యాన్స్ లో కిక్ పెంచేశారు సల్మాన్ భాయ్.
సల్మాన్ భాయ్ ఈ మాట చెప్పగానే స్క్రీన్ మీదకు మున్నాభాయ్ టాపిక్ వచ్చేసింది. నా కెరీర్‌లో నేను ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో మున్నాభాయ్2 ఉంటుంది.
ఈ మూవీ నెక్స్ట్ పార్ట్ కోసం జనాలు ఎంత ఇష్టంగా ఎదురుచూస్తున్నారో నాకు బాగా తెలుసు అని అన్నారు విధు వినోద్ చోప్రా.
మున్నాభాయ్‌కి మాత్రమే కాదు.. త్రీ ఇడియట్స్ సినిమాకు కూడా నెక్స్ట్ పార్ట్ సిద్ధం అవుతోందన్నారు విధు వినోద్.
ఆ మధ్య త్రీ ఇడియట్స్ హీరోలు కలిసి తీసుకున్న ఫొటో హల్‌చల్ చేసింది. దీన్ని బట్టి అప్పటి నుంచే సెకండ్ పార్టుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది వాస్తవం.
మరిన్ని వెబ్ స్టోరీస్
సంక్రాంతికి సమ్మర్‌కి మధ్య కొత్త సీజన్.. క్రేజీ సినిమాలు క్యూ..
అది నా సక్సెస్‌కి ఎంతగానో ఉపయోగపడింది: రష్మిక..
విక్రమార్కుడు 2 కథ రెడీ.. హీరో నాట్ రెడీ..