అది నా సక్సెస్‌కి ఎంతగానో ఉపయోగపడింది: రష్మిక..
31 December
2024
Battula Prudvi
సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవరి స్ట్రాటజీ వారిది. ఎవరికి సాయం చేసేవాళ్లు వాళ్లకి ఉంటారు. కానీ ఎవరి సాయమూ లేకుండా ఎదిగిన వారు కూడా కొందరు ఉంటారు.
అలా ఎదగడానికి సొంత తెలివితేటలు ఉపయోగపడతాయి. హీరోయిన్ రష్మికకు కూడా ఇలాంటి నాలెడ్జే బాగా యూజ్ అయిందట.
దీని గురించి స్పందించారు రష్మిక మందన్న. స్క్రిప్ట్ సెలక్షన్ బావుండటం అనేది తనకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు.
కథ వింటున్నప్పుడు... మెయిన్ పాయింట్ తన చుట్టూ తిరిగేలా ఉండాలనుకుంటారట నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
తాను నటించిన సినిమా ద్వారా ఏదో సమాజంలో జనాలకు ఒక మెసేజ్ ఇచ్చేలా ఉండాలనుకుంటారట కథానాయకి రష్మిక మందన్న.
అలాగని అన్నీ సార్లు సందేశం ఇవ్వడం కుదరదు కాబట్టి... అది సాధ్యం కాకపోయినా ఫర్వాలేదనుకుంటారట ఈ బ్యూటీ.
ప్రస్తుతం ఎక్కువగా పుష్ప 2 ది రూల్ లాంటి యాక్షన్ బేస్డ్ సినిమాల్లో నటిస్తున్నారు హీరోయిన్ రష్మిక మందన్న.
అయితే తనకు రొమాంటిక్ సినిమాల్లో నటించాలని ఉందని అన్నారు. ప్రేమకథల్లో నటిస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుందని అన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అలాంటివి నాకు చేతకాదు: తాప్సి..
ఆ సినిమా కోసం 17 గంటలు పని చేసిన కృతి..
డబ్బులు ఇస్తామంటే అడగండి: శృతి..