అలాంటివి నాకు చేతకాదు: తాప్సి.. 

30 December 2024

Battula Prudvi

ప్రస్తుతం గ్లామర్‌ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరూ రాత్రి పది తర్వాత పార్టీల్లో కనిపిస్తూ ఉండాల్సిందేనా?

అందరి సంగతి ఏమోగానీ, పది తర్వాత పార్టీ అంటే నాకు కుదరదు అని డైరక్ట్ గా చెప్పేస్తున్నారు తాప్సీ పన్ను.

పెద్ద స్టార్లకు మెసేజ్‌లు పెట్టమని చాలా సార్లు స్టార్ హీరోయిన్ తాప్సీకి ప్రముఖుల నుంచి సలహాలు అందాయట.

స్టార్‌ నైట్స్ కీ, బర్త్ డే పార్టీలకు అటెండ్‌ అయ్యే ఛాన్స్ వస్తుంది. త్వరగా ఎదగవచ్చు అని కూడా అన్నారట.

అయితే కష్టపడి ఇంత దూరం వచ్చిన తాను, అలా నైట్‌ పార్టీలకు వెళ్లాలని అనుకోవడం లేదని అంటున్నారు హీరోయిన్ తాప్సీ.

పది తర్వాత జరిగే ఎలాంటి పార్టీల మీద తనకు పెద్ద ఇంట్రస్ట్ లేదని అన్నారు స్టార్ కథానాయక తాప్సి పన్ను.

మద్యం సేవించను, సిగరెట్‌ ముట్టుకోను.. కొత్తగా పరిచయం అయిన వారికి స్పెషల్‌గా కబుర్లు చెప్పడం కూడా చేతకాదు.

అలాంటప్పుడు పార్టీలకు వెళ్లి ఏం చేయాలన్నది తాప్సీ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఆలోచించాల్సిన విషయమే... ఏమంటారూ!