తొలి మూవీతో భారీ నష్టాలు.. ఇప్పుడు టాప్ ప్లేస్.. హోంబలే ప్రయాణం ఇలా..
29 December 2024
Battula Prudvi
కేజీఎఫ్, సలార్‌తో సెన్సేషన్ సృష్టించి... టాక్ ఆఫ్ ఇండస్ట్రీ గా నిలిచింది హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ సంస్థ.
కేవలం ఈ సినిమాల కారణంగానే హోంబలే ప్రొడక్షన్ సంస్థ గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారని తెలిసిన విషయమే.
విజయ్ కిరంగదూర్ , చలువే గౌడ, కార్తీక్ గౌడ.. వీరే హోంబలే పుట్టుకకు కారణం. తమ ఇలవేల్పు హోంబలమ్మ పేరిట హోంబలే ఫిల్మ్స్ అనిపేరు పెట్టారు.
పునీత్ రాజ్‌కుమార్‌తో వారు తొలుత నిన్నిందలే అనే సినిమాను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ సంస్థ.
కానీ నిన్నిందలే సినిమా నష్టాన్ని మిగిల్చింది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును తుడిచిపెట్టేసింది.
తర్వాత మాస్టర్‌పీస్ అనే సూపర్ హిట్ చిత్రంతో హోంబలే ఫిలిమ్స్ సంస్థ పేరు కన్నడ ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కాంతారా చిత్రాలతో హోంబలే ఫిలిమ్స్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది.
2023లో సలార్‌తో.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తోంది. అలా ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగింది హోంబలే.