హిందీలో సినిమా చేస్తేనే గొప్ప స్టార్ అనే భ్రమలు ఎవరికీ లేవు. ముంబై సెలబ్రిటీ సర్కిల్స్‌లో గుట్టుగా వినిపిస్తున్న ఈ మాటనే ఫైర్ బ్రాండ్ కంగన మరోసారి ఓపెన్‌గా చెప్పేశారు.
మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ మీద సీరియస్ కామెంట్స్ చేశారు కంగనా రనౌత్. బాలీవుడ్‌ను ప్రధాన చిత్ర పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరం లేదన్నారు.
అసలు బాలీవుడ్ సినిమాకు అలాంటి క్వాలిటీస్ ఏవీ లేవన్నారు ఫైర్‌బ్రాండ్. అక్కడి వారంతా గిరి గీసుకొని అందులోనే ఉంటారన్నారు ఈ బ్యూటీ.
చాన్నాళ్లుగా సౌత్ మీద స్పెషల్‌గా ఫోకస్ చేస్తున్నారు కంగన రనౌత్. ఆ మాటకొస్తే నార్త్ నుంచి అమితాబ్, దీపికతో పాటు చాలా మంది ఆర్టిస్టులు సౌత్‌వైపు మొగ్గుచూపుతున్నారు.
మన ఎదుగుదలకు రీజన్... జస్ట్ ఉత్తరాదివాళ్లు మనతో కలిసిపోవడం మాత్రమే కాదు.. అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
మన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యికోట్లకు పైగా వసూళ్లు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆల్రెడీ కల్కితో థౌజండ్ క్రోర్స్ దాటేశాం.
ఇయర్ ఎండింగ్‌లో పుష్పరాజ్‌తో ఆ నెంబర్‌ని మరోసారి క్రాస్ చేశాం. హిందీలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ మూవీ.
కాస్త గట్టిగా కాన్‌సెన్‌ట్రేట్ చేయాలేగానీ 2025లో మన దగ్గరి నుంచి వెయ్యికోట్ల సినిమాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అలాంటప్పుడు బాలీవుడ్.. ఇండియన్ సినీ మెయిన్ ఇండస్ట్రీ ఎలా అవుతుంది? ఎక్కడ నెంబర్స్ ఎక్కువగా రెజిస్టర్ అయితే అదే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ.