సంక్రాంతికి సమ్మర్‎కి మధ్య కొత్త సీజన్.. క్రేజీ సినిమాలు క్యూ.. 

31 December 2024

Battula Prudvi

2025 ఫిబ్రవరిలో క్రేజీ సినిమాలు కొన్ని ముందే వచ్చేస్తున్నాయి. అందులో తండేల్ ఒకటి. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల చేయనున్నారు మేకర్స్.

చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో చైతూ, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.

ఫిబ్రవరి 14న లైలా సినిమా రాబోతుంది. ఇప్పటి వరకు మాస్ సినిమాలతోనే నిరూపించుకున్న విశ్వక్ సేన్.. మొదటి సారి లైలా కోసం అమ్మాయిగా నటిస్తున్నారు.

ఇక నితిన్ సైతం ఫిబ్రవరిపైనే కన్నేసారు. రాబిన్ హుడ్ క్రిస్మస్‌కు రావాల్సి ఉన్నా.. వాయిదా పడింది. క్రిస్మస్ డేట్ మిస్సవ్వడంతో ఫిబ్రవరిపైనే ఫోకస్ చేస్తున్నాడు.

ఇక తమ్ముడు సైతం అలాగే హోల్డ్‌లో ఉండిపోయింది. దిల్ రాజు నిర్మిస్తున్న తమ్ముడు సైతం ఫిబ్రవరి అన్నారు. ఈ రెండింట్లో ఒకటైతే ఫిబ్రవరిలో రావడం ఖాయం.

అలాగే మ్యాడ్ సీక్వెల్ ఇదే నెలలో రానుంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తానికి 2025 ఫిబ్రవరి హౌజ్ ఫుల్ అయిపోయింది.

క బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న దిల్‎రుబా కూడా ఫిబ్రవరిలోనే విడుదల. ఇందులో రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్.

ఆది పినిశెట్టి, లక్ష్మి మీనన్ జంటగా అరివళగన్ వెంకటాచలం తెరకెక్కిస్తున్న హారర్ మూవీ శబ్దం కూడా ఫిబ్రవరిలోనే రానుంది.