04 January 2025

ఫ్యామిలీతో బీచ్‌లో ప్రియాంక చోప్రా.. ఫోటోస్ వైరల్!

TV9 Telugu

స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫ్యామిలీతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నటి తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న  ఫోటోలు తన ఇన్ స్టాలో పోస్టు చేసింది

 ప్రస్తుతం  ప్రియాంక చోప్రా వెకేషన్ ఫోటోలు తన ఇన్ స్టాలో పోస్టు చేయడంతో ,ఇవి నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

ఫోటోల్లో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక తన భర్త నిక్‌తో కలిసి కొన్ని రొమాంటిక్ ఫోజులిస్తూ స్టైలిష్‌గా కనిపించారు.

అలాగే ప్రియాంక చోప్రా కూతురితో మాల్టీతో బీచ్‌లో ఆడుకుంటూ, భర్తతో కబుర్లు చెబుతూ  ఫ్యామిలీతో సందడి చేసింది.

అంతే కాకుండా ఈ  ముద్దుగుమ్మ బీచ్‌లో రెడ్ కలర్ బికినీలో కనిపించి తన అభిమానులు అందాల ట్రీట్ ఇచ్చింది..

తన భర్త, కూతురుతో సముద్రంలోకి బోట్ రైడ్‌కు వెళ్తూ ఉన్న ఫోటోలను, నీటీలో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలను తమ అభిమానులతో పంచుకుంది. 

ఇలా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది.