05January 2025

రాహువు సంచారం.. ఎనిమిది సంవత్సరాల తర్వాత అదృష్టం పట్టే రాశులివే!

TV9 Telugu

తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. చాలా మంది ప్రతి రోజూ ఉదయాన్నే తమ రాశి ఎలా ఉందో చూసుకుంటూ ఉంటారు. 

అయితే చాలా సంవత్సరాల తర్వాత మూడు రాశుల వారికి అదృష్టం పట్టనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అనుకుంటున్నారా?

మేష రాశి, మకర రాశి , కుంభ రాశి. వీరికి రాహువు సంచారంతో ఈ సంవత్సరం అదృష్టం కలిసి రానున్నది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

గ్రహాల్లో ఒక్కటైన రాహువు దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. మీన రాశి నుంచి కుంభరాశిలోకి రాహువు సంచరించబోతున్నాడు.

దీంతో మేష రాశి వారికి ప్రమోషన్స్ రావడం, ఆర్థిక సమస్యలు తీరిపోయి, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అంతే కాకుండా ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా రావడం జరుగుతుందంట.

ఇక మకర రాశి వారు కూడా అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోవడం, ధన లాభం, చాలా రోజులుగా ఖాళీగా ఉన్న వారు ఉద్యోగంలో చేరడం, ఆర్థికంగా కలిసి రావడం జరుగుతుంది.

అలాగే కుంభ రాశి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి ఉద్యోగం రావడం జరుగుతుంది

అంతేకాకుండా, దీర్ఘకాలిక సమస్యల నుంచి బయట పడటం, ఆర్థికంగా బలపడటం, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.