తగినంత నీరు త్రాగాలి. శరీరంలో నీటి లోపం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరులో ఆటంకం ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ వల్ల జుట్టు కూడా పొడిబారుతుంది. శరీరంలో నీటి లోపం వల్ల కూడా జుట్టు రాలిపోయే సమస్య కూడా పెరుగుతుంది. చాలా మంది బరువు తగ్గడానికి డైట్ ఫాలో అవుతుంటారు. ఫలితంగా శరీరంలో విటమిన్ సి, డి, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపిస్తే జుట్టుకు కావాల్సిన పోషకాలు అందవు. ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.