CSIR UGC NET 2025 Admit Cards: మరో 2 రోజుల్లోనే సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్ ఇదిగో
CSIR UGC NET December 2025 Admit Cards Download: జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 పరీక్ష మరో 2 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి..

హైదరాబాద్, డిసెంబర్ 16: జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 పరీక్ష మరో 2 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 18న ఒకే రోజు ఆన్‌లన్ విధానంలో 2 షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. లైఫ్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ పేపర్లకు షిఫ్టు 1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. కెమికల్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ పేపర్లకు షిఫ్టు 2లో 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
కాగా జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్-2025 ద్వారా సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు జేఆర్‌ఎఫ్‌తోపాటు, పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పిస్తుంది. దీనితో పాటు జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, యూనివర్సిటల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపిక కావచ్చు.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ఏపీపీ రాత పరీక్షలకు 77.6% మంది హాజరు
తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)ల నియామకం కోసం రాతపరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 118 పోస్టుల నియామకం కోసం ఉదయం పేపర్ 1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం పేపర్ 2(డిస్క్రిప్టివ్) విధానంలో 2 విడతలుగా పరీక్షల్ని నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,925 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 2,306మంది పేపర్ 1 పరీక్షకు హాజరు కాగా.. 2,270మంది మాత్రమే పేపర్-2 పరీక్షకు హాజరైనట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది. మొత్తంగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థుల్లో 77.6% మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్లు తెలుస్తుంది. ఆ పరీక్షల ఆన్సర్ కీని త్వరలోనే వెబ్‌సైట్ www.tgprb.inలో ఉంచనున్నట్లు బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








