Gold Price Today: రికార్డ్ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో తెలుసా?
Gold Price Today: ఈ ధరలు ఉదయం 6 గంటలకు వరకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా ప్రతి రోజు 9 నుంచి 10 గంటల మధ్యన ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. దీంతో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. బంగారం కొనుగోలు..

Gold Price Today: ఇక తులం ధర లక్షా 35 వేలు దాటేసింది. త్వరలో మరిన్ని రికార్డులు సృష్టించనుందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోంది. తాజాగా డిసెంబర్ 16వ తేదీన దేశీయంగా తులం బంగారం ధర రూ.1,35,390 వద్ద ట్రేడవుతోంది. అంటే లక్షా 40 వేల చేరువలో దూసుకెళ్తోంది. ఇక వెండి విషయానికొస్తే నేనేందుకు తగ్గాలే అన్నట్లు ఇది కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర రూ.2 లక్షల 3100 వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్‌లో అయితే భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి 2 లక్షల 15 వేల 100 వద్ద ట్రేడవుతోంది.
ప్రస్తుతం బంగారం, వెండి కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. వచ్చే ఏడాది 2026లు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇది కూడా చదవండి: New Aadhaar App: ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,260 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,390 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,110 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,390 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,110 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,390 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,110 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,160 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,390 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,110 వద్ద కొనసాగుతోంది.
ఈ ధరలు ఉదయం 6 గంటలకు వరకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా ప్రతి రోజు 9 నుంచి 10 గంటల మధ్యన ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. దీంతో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. బంగారం కొనుగోలు చేసే ముందు ధరలను తెలుసుకుని వెళ్లడం మంచిది. అలాగే అల్‌మార్కింగ్‌ను కూడా తప్పనిసరి చూసకుని నగలను కొనుగోలు చేయడం మంచిది. లేకుంటే మోసపోయే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: OnePlus 13R స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. అసలు ధర ఎంతో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




