Sankranti Holidays: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?

సంక్రాంతికి విద్యార్ధులకు పెద్ద పండుగే.. సెలవులే సెలవులు ప్రకటించాయి రెండు తెలుగు రాష్ట్రాలు. ఏపీ, తెలంగాణలో స్కూల్స్, జూనియర్ కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి ఉండనున్నాయి.? ఎన్ని రోజులు అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? లేట్ ఎందుకు ఓ లుక్కేయండి

Sankranti Holidays: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 09, 2025 | 8:37 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై కాస్త గందరగోళం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వాలు సెలవులపై క్లారిటీ ఇచ్చేశాయి. విద్యార్ధులకు సెలవులే సెలవులు రానున్నాయి. మరి ఏపీ, తెలంగాణలో స్కూల్స్, జూనియర్ కాలేజీలకు ఎన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి.? ఎప్పుడెప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలోని స్కూళ్లకు ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు..

జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు..

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్‌కు ఈ నెల 10 నుంచి 19 వరకు..

క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్‌కు జనవరి 11 నుంచి జనవరి 15 వరకు..

జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి జనవరి 17 వరకు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ పరంగా రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు వచ్చే వారం అంతటా సెలవులే సెలవులు ఉండనున్నాయి.

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్..

అటు సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది రైల్వేశాఖ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి