మగవారిలో ఈ లక్షణాలు ఉంటే థైరాయిడ్ ఉన్నట్లే?
09 January 2025
samatha
ప్రస్తుతం థైరాయిడ్ సమస్య అనేది చాలా సాధారణం అయిపోయింది. ముఖ్యంగా థైరాయిడ్ ఎక్కవగా మహిళల్లో ఉంటుంది.
దీంతో చాలా మంది పురుషులు థైరాయిడ్ సమస్య అనేది ఆడవారిలో మాత్రమే ఉంటుంది, అసలు మాకు రాదు అని అనుకుంటా
రు.
కానీ థైరాయిడ్ అనేది మగవారిలో కూడా ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా చాలా మంది మగవారు ఈ సమస్య బారిన పడుతున్నారు.
కాగా, మగవారిలో థైరాయిడ్ సమస్య ఉంటే కనిపించే లక్షణాలు ఏవీ, ఏ వయసులో ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల్లో ఈ థైరాయిడ్ సమస్య అనేది 40 ఏళ్లకంటే తక్కువగా ఉన్నవారిలో అధికంగా కనిపిస్తుందంటున్నారు వైద్యులు.
మగవారిలో అకస్మాత్తుగా జుట్టురాలడం, బక్కగా అవ్వడం లేదా ఉన్నట్లుండి లావు అవ్వడం అనేది థైరాయిడ్ లక్షణం.
అలాగే చిన్న వయసులోనే లైంగిక ఆసక్తి తగ్గడం,వీర్యకణాల నాణ్యత తగ్గడం అనేది కూడా థైరాయిడ్ లక్షణమే అంటున
్నారు వైద్యులు.
అంతే కాకుండా, బలహీనత, ఆకలిలేకపోవడం, చర్మం పొరిబారడం, కండరాల నొప్పి, ఇవన్నీ కూడా థైరాయిడ్ సమస్య వలన వస్తుంటాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : మీ జీవితాన్ని నాశనం చేసే 6 అతి పెద్ద తప్పులివే!
ఆధార్లో మన ఫోటో అస్సలే బాగోదు.. ఎందుకో తెలుసా?
బక్కగా ఉన్నారని బాధపడుతున్నారా?..అద్భుతమైన చిట్కాలు, మీకోసమే!