AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా.. బాబోయ్!

ఎయిర్ పోర్టులో అప్పుడే ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణీకులు అందరూ కూడా లగేజ్ చెకిన్ దగ్గరకు వచ్చారు. అయితే అప్పుడే వచ్చిన ఓ ప్రయాణీకుడిపై అనుమానమొచ్చింది అధికారులు. తత్తరపాటు, బిత్తరచూపులు.. అతడిపై డౌట్ వచ్చి లగేజ్ చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు.

Viral: లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా.. బాబోయ్!
Ravi Kiran
|

Updated on: Jan 10, 2025 | 6:46 AM

Share

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు తమ ఫ్లైట్స్‌ కోసం బిజీ బిజీగా వెళ్తున్నారు. చెకింగ్‌ దగ్గర సిబ్బంది ప్రయాణికు లగేజ్‌ చెక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి చేతిలో ఉన్న బ్యాగ్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో సెక్యూరిటీ అతని లగేజ్‌ను చెక్‌ చేశారు. ఆ బ్యాగులో మొసలి తల ఉండటం చూసి షాకయ్యారు. దానిని స్వాధీనం చేసుకుని, ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయం విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.

జనవరి 6న కెనడా పౌరుడైన వ్యక్తి టొరంటో వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. ఎయిర్ కెనడా విమానం ఎక్కే ముందు సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని చెక్‌ ఇన్‌ చేశారు. ఆ వ్యక్తిపై అనుమానం రావడంతో టెర్మినల్ 3 వద్ద లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో ఒక బ్యాగ్‌లో మొసలి తల ఉండటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. కాగా, కస్టమ్స్‌ అధికారులు ఆ మొసలి తలను స్వాధీనం చేసుకున్నారు. దానిని గుడ్డతో చుట్టి లగేజ్‌లో అతడు ఉంచినట్లు తెలిపారు. 777 గ్రాముల బరువున్న మొసలి తలను ఢిల్లీకి చెందిన అటవీశాఖ అధికారులు పరిశీలించారు. మొసలి పిల్లకు చెందినదిగా వారు నిర్ధారించారు. దర్యాప్తు కోసం డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు దానిని పంపారు. ఆ కెనడా పౌరుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Crocodile Head

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ