తిరుమల తిరుపతిలో జరిగిన విషాద సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని అధికారులు, నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో గౌతమిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.