సోంపు గింజలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీరు తిన్నారో బండి షెడ్డుకే!
09 January 2025
TV9 Telugu
TV9 Telugu
చాలామంది భోజనం తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుని తింటుంటారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాల్లో అన్ని రకాల ఆహార పదార్థాలతోపాటు దీన్ని తప్పనిసరిగా పెడతారు. హోటల్స్‌లోనూ భోజనం చివర్లో ప్రత్యేకంగా అందిస్తారు
TV9 Telugu
ఇందుకు కారణం ఆహారం బాగా జీర్ణమవుతుందనే. సోంపు చాలా రుచిగా ఉండటమే కాదు ఔషధ గుణాలను కలిగి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది ఫెన్నెల్ ను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా తింటుంటారు
TV9 Telugu
ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగానే పరిగణించబడతాయి. సోంపు గింజల్లో విటమిన్ సి, ఇ, కె, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పాలీఫెనాల్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
100 గ్రాముల సోంపులో 40 గ్రాముల పీచు ఉంటుంది. ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని తింటే ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది
TV9 Telugu
క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తరచూ ఆహారంతోపాటు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణ సమస్యలకే కాదు ఆకలి పెరగాలన్నా దీన్ని తీసుకోవాల్సిందే
TV9 Telugu
సోంపు తినడం నిస్సందేహంగా ఆరోగ్యానికి ప్రయోజనకరమే. అయితే కొంతమంది మాత్రం వీటిని తినడం హానికరం అంటున్నారు నిపుణులు. సోపును ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం, జీర్ణక్రియ బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
ముఖ్యంగా చర్మ అలెర్జీ సమస్యలు ఉన్నవారు సోంపు తినకుండా ఉండటమే మంచిది. ఇది దురద, దద్దుర్లు వంటి చర్మ అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. అలాగే సోంపును అధికంగా తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
అందుకే ఈ సమస్యలున్న వారు సోంపు తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదంటున్నారు. సోపును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఉదయం పరగడుపున తాగి, సోపు నమిలి తినవచ్చు. భోజనం తర్వాత ఒక టీస్పూన్ ఫెన్నెల్ తింటే సరిపోతుంది