Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love: ఇది కదా నిజమైన ప్రేమంటే.. ప్రేమించిన వ్యక్తి కోసం 2 వేల కోట్ల ఆస్తిని వదులుకున్న వ్యాపారవేత్త కూతురు

ప్రేమకు కులం, మతం,ప్రాంతం అనే తేడా ఉండదు. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు మనస్పూర్తిగా ఇష్టపడితే ఇలాంటి భేదాలు ఏం పట్టించుకోకుండా జీవితాంతం కలిసి ఉండాలనుకుంటారు. మరికొందరు ఆస్తిపరులైనా కూడా తాను ప్రేమించిన వ్యక్తి కోసం అన్ని వదిలేసి వస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తుంది ఆ యువతి. ధనిక కుటుంబంలో పుట్టి పెరిగిన ఆ యువతి సాధాసీదా వ్యక్తిని ప్రేమించింది. అతడే తన సర్వస్వం అనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. అయినప్పటికీ అతనితోనే పెళ్లి చేసుకుంటానని సిద్ధమైంది.

Love: ఇది కదా నిజమైన ప్రేమంటే.. ప్రేమించిన వ్యక్తి కోసం 2 వేల కోట్ల ఆస్తిని వదులుకున్న వ్యాపారవేత్త కూతురు
Couple
Follow us
Aravind B

|

Updated on: Aug 15, 2023 | 5:36 AM

ప్రేమకు కులం, మతం,ప్రాంతం అనే తేడా ఉండదు. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు మనస్పూర్తిగా ఇష్టపడితే ఇలాంటి భేదాలు ఏం పట్టించుకోకుండా జీవితాంతం కలిసి ఉండాలనుకుంటారు. మరికొందరు ఆస్తిపరులైనా కూడా తాను ప్రేమించిన వ్యక్తి కోసం అన్ని వదిలేసి వస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తుంది ఆ యువతి. ధనిక కుటుంబంలో పుట్టి పెరిగిన ఆ యువతి సాధాసీదా వ్యక్తిని ప్రేమించింది. అతడే తన సర్వస్వం అనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. అయినప్పటికీ అతనితోనే పెళ్లి చేసుకుంటానని సిద్ధమైంది. అంతేకాదు.. వారసత్వంగా వచ్చినటువంటి వేల కోట్ల ఆస్తిని కూడా కాదనుకుంది. మలేషియా వ్యాపారవేత్త కుమార్తె అయిన ఆమె ప్రియుడి కోసం అన్ని వదులుకొని ఇంటినుంచి బయటకు వెళ్లి తనకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే మలేషియాకు చెందిన ఏంజెలినా ఫ్రాన్సిస్.. ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కే పెంగ్ , మాజీ మిస్ మలేషియ పాలైన్ ఛాయ్ దంపతుల కూతురు.ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంది. చదువుకునే రోజుల్లోనే జెడియా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. కానీ అతనితో పెళ్లి చేసేందుకు వారు ఒప్పుకోలేదు. ఆర్థికపరంగా చూసుకుంటే రెండు కుటుంబాల మధ్య భారీ తేడా ఉందని ఆమెకు నచ్చజెప్పారు. అతడ్ని వదిలేయాలని లేకపోతే వారసత్వాన్ని వదులుకోవాలని ఆదేశించారు. అయితే ఆమె మాత్రం తన ప్రియుడితోనే ఉండాలనుకుని నిర్ణయించుకుంది. ఇంటినుంచి బయటకు వెళ్లిపోయి.. 2008లోఅతడ్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వారసత్వంగా వచ్చే్ 2వేల కోట్ల రూపాయల ఆస్తిని వదిలేసుకుంది.

పెళ్లి అయిన తర్వాత ఈ దంపతులు తమ రెండు కుటుంబాలకు దూరంగానే ఉన్నారు. అయితే చాలారోజుల పాటు దూరంగా ఫ్రాన్సిస్.. ఒకరోజున తన తల్లిదండ్రులను కలవాల్సిన పరిస్థిత వచ్చింది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆమె అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే తన తల్లి గురించి గొప్పగా చెప్పింది. కుటుంబం కోసం తన తల్లి చేసినటువంటి సేవలను కొనియాడింది. కానీ తన తండ్రిపై మాత్రం విమర్శలు చేసింది. ఏదేమైన కూడా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మళ్లీ తిరిగి కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం ఆమె సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక నెటీజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..