జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. భద్రతా దళాలకు చిక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులు!
బుధవారం (జనవరి 7, 2026) జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని బిల్లావర్‌లో భారత భద్రతా దళాలు - జైష్-ఎ-మొహమ్మద్ (JM) ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బిల్లావర్‌లోని ధను పరోల్ అడవుల్లో భారీ కాల్పులు జరుగుతున్నాయని భద్రతావర్గాల సమాచారం. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

బుధవారం (జనవరి 7, 2026) జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని బిల్లావర్‌లో భారత భద్రతా దళాలు – జైష్-ఎ-మొహమ్మద్ (JM) ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బిల్లావర్‌లోని ధను పరోల్ అడవుల్లో భారీ కాల్పులు జరుగుతున్నాయని భద్రతావర్గాల సమాచారం. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు – భద్రతా దళాలు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు జరిపిన ఈ చర్య 2026లో జరిగిన మొదటి ప్రధాన ఎన్‌కౌంటర్‌గా భావిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు మార్చి 26, 2025న నలుగురు కథువా పోలీసు సిబ్బందిని హతమార్చారు. గత తొమ్మిది నెలలుగా పరారీలో ఉన్నారు. ఉగ్రవాదుల గురించి భద్రతా దళాలకు సమాచారం అందినప్పుడు, సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఘటనలో ముగ్గురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బిల్లావర్‌లోని కహోగ్ గ్రామంలో బుధవారం (జనవరి 07) సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని తెలిపారు.
Op update 1:Despite darkness, thick vegetation and treacherous terrain, SOG relentlessly engaging the terrorists. Teams of CRPF are also participating in the Joint Op .
— IGP Jammu (@igp_jammu) January 7, 2026
ఇదిలావుంటే, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు మార్చి 26, 2025న ఆకస్మిక దాడి చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో నలుగురు జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది అమరులయ్యారు. అప్పటి నుండి, జమ్మూ కాశ్మీర్ పోలీసులు – భద్రతా సంస్థలు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం వెతుకుతున్నాయి. భద్రతా దళాల దృష్టిని తప్పించుకోవడానికి, జైషే ఉగ్రవాదులు నిరంతరం తమ స్థానాలను మారుస్తూ వచ్చారు. చివరికి బిల్లావర్, కథువా పరిసర ప్రాంతాలలోని దట్టమైన అడవులలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత, ఉగ్రవాదులు చివరకు భద్రతా దళాలను తారసపడ్డారు.
ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి గ్రామానికి అదనపు బలగాలను పంపినట్లు అధికారులు తెలిపారు. నిఘా సమాచారం అందిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), CRPF సంయుక్త బృందం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులు సెర్చింగ్ బృందంపై కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ప్రతిదాడి చేశాయి. దీంతో ఎన్‌కౌంటర్ జరిగింది. రాత్రి చీకటి, దట్టమైన అడవులు ఉన్నప్పటికీ, భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి దృఢంగా నిశ్చయించుకున్నాయని భద్రతావర్గాలు తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
