AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. మనిషే నా? 19 ఏళ్ల మైనర్ బాలికను రూ.10 లక్షలకు అమ్మేసిన కన్నతల్లి!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతి, తనను కుటుంబసభ్యులే వ్యభిచారంలోకి దింపుతున్నారని, ఆమె ప్రతిఘటించడంతో తీవ్ర కొట్టారని బాధితురాలు తెలిపింది. తన తల్లి, ఇద్దరు అక్కలు తనను వేధించారని, డబ్బు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది.

ఛీ.. ఛీ.. మనిషే నా? 19 ఏళ్ల మైనర్ బాలికను రూ.10 లక్షలకు అమ్మేసిన కన్నతల్లి!
Forced Prostitution In Lucknow
Balaraju Goud
|

Updated on: Oct 31, 2025 | 8:52 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతి, తనను కుటుంబసభ్యులే వ్యభిచారంలోకి దింపుతున్నారని, ఆమె ప్రతిఘటించడంతో తీవ్ర కొట్టారని బాధితురాలు తెలిపింది. తన తల్లి, ఇద్దరు అక్కలు తనను వేధించారని, డబ్బు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది. తనను గుర్తు తెలియని వ్యక్తికి 10 లక్షల రూపాయలకు అమ్మేశారని ఫిర్యాదు చేసింది. ఆమె నిరసన వ్యక్తం చేయడంతో, ఆమెను దారుణంగా కొట్టారు. పోలీసులు ఫిర్యాదు అందుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

లక్నోలోని ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి, సోదరీమణులు 19 ఏళ్ల బాలికను రూ.10 లక్షలకు అమ్మేశారు. ఆ బాలిక నిరసన వ్యక్తం చేయడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. తనను వ్యభిచారంలోకి దింపుతున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తన తల్లి కహకాషా ఖాన్, అక్కలు అక్సా ఖాన్, సమ్రా ఖాన్ తనను హింసించారని, కొట్టారని బాధితురాలు తెలిపింది.

బాధితురాలి వయస్సు 19 సంవత్సరాలు, 11వ తరగతి చదువుతోంది. కుటుంబ పోషణకు డబ్బులు సంపాదించాలనుకున్నారు. అయితే తల్లీ ఇద్దరు పెద్ద కూతుళ్లు, మైనర్ అయిన చిన్న కూతురును వ్యభిచార రొంపిలోకి దించాలనుకున్నారు. బాధితురాలిపై ఒత్తిడి తీసుకువచ్చి, చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ఒక తెలియని వ్యక్తిని తీసుకువచ్చి, వారితో వెళ్లాలని, చాలా డబ్బు ఇస్తారని అప్పజెప్పేందుకు ప్రయత్నించారు. బాధితురాలు దీనిని వ్యతిరేకించడంతో, ఆమె తల్లి, సోదరీమణులు తీవ్రంగా కొట్టారు. 10 లక్షల రూపాయలకు అమ్మేశామని, వెళ్లిపోవాలంటూ హింసించారు.

బాధితురాలు ప్రతిఘటించడంతో, ఆమె తల్లి, ఇద్దరు సోదరీమణులు, గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ఆమెను తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెకు స్పృహ తిరిగి వచ్చేసరికి, ఆసుపత్రిలో ఉంది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత, ఆమెను మళ్ళీ వ్యభిచారంలోకి దింపారు. ఆమె, ఆమె చెల్లెలు వారి నుండి తప్పించుకుని తన తండ్రి వద్దకు చేరుకుంది. విషయం తెలుసుకున్న తల్లీ, అక్కలు మరోసారి దాడికి తెగబడ్డారు. చివరికి కుటుంబసభ్యుల వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిర్లక్ష్యం కారణంగా, ఆమె పోలీస్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి