AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటిని శుభ్రం చేస్తుండగా.. చెత్త బుట్టలో కన్పించిన రూ.కోట్లు.. కట్‌చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్!

Share Certificates In Dustbin: అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.. ఈ సామెత తెలియని వారుండరు. సరిగ్గా ఇలాంటి రీతిలోనే ఓ వ్యక్తి అనుకోకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతగాడి తాత ఇంట్లో ఓ చెత్తబుట్ట రూపంలో అదృష్టం వరించింది. కోట్ల విలువైన పత్రాలు అతడికి దొరికాయి. అయితే ఈ వ్యవహారం అతడి ఇంట్లో గొడవలకు కారణం అయ్యాయి..

ఇంటిని శుభ్రం చేస్తుండగా.. చెత్త బుట్టలో కన్పించిన రూ.కోట్లు.. కట్‌చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్!
Share Certificates Worth Crores Found In Dustbin
Srilakshmi C
|

Updated on: Oct 31, 2025 | 7:21 PM

Share

అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.. ఈ సామెత తెలియని వారుండరు. సరిగ్గా ఇలాంటి రీతిలోనే ఓ వ్యక్తి అనుకోకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతగాడి తాత ఇంట్లో ఓ చెత్తబుట్ట రూపంలో అదృష్టం వరించింది. కోట్ల విలువైన పత్రాలు అతడికి దొరికాయి. అయితే ఈ వ్యవహారం అతడి ఇంట్లో గొడవలకు కారణం అయ్యాయి. తాత ఆస్తి నాదంటే.. నాదని..కోట్టుకోవడంతో ఈ పంచాయితీ కోర్టుకు చేరింది. గుజరాత్‌లో చోటు చేసుకున్న ఈ సంఘన స్థానికంగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

గుజరాత్‌లోని ఉనాలో ఓ ఇళ్లు వారసత్వంగా వ్యక్తికి లభించింది. అతడి తాత సావ్జీ పటేల్ మరణం తర్వాత ఉనాలోని ఇంటిని వారసత్వంగా పొందాడు. దీంతో అతడు ఇంటిని శుభ్రం చేయడానికి వెళాడు. శుభ్రం చేస్తున్న క్రమంలో ఆ ఇంట్లో ఓ మూలన ఉన్న చెత్త బుట్టలో కొన్ని పేపర్లు కనిపించాయి. చేతిలోకి తీసి చూడగా అతడి కళ్లు దీపావళి టపాసుల్లా వెలిగాయి. ఎందుకంటే అవి షేర్‌ మార్కెట్‌ పేపర్లు మరి. వాటి విలువ ప్రస్తుత మార్కెట్లోరూ.2.5 కోట్లు ఉందని తెలుసుకుని ఎగిరి గంతేశాడు. అతడు ధనవంతుడు కావడానికి ఇదే షార్ట్‌కట్‌ అయింది. అయితే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అతడి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అతడు, అతని తండ్రి ఇద్దరూ షేర్‌ మార్కెట్ పేపర్లకు వారసుడు నేనంటే.. నేను అంటూ వాదులాడుకున్నారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా వివాదానికి దారి తీసింది. షేర్ సర్టిఫికెట్లు అనేవి షేర్ల యాజమాన్యాన్ని నిరూపించడానికి గతంలో జారీ చేయబడిన భౌతిక పత్రాలు. వీటిని డీమెటీరియలైజ్డ్ ఫారమ్‌లోకి బదిలీ చేయవచ్చు.

నిజానికి సావ్జీ పటేల్‌.. గతలో డయ్యూలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేశారు. అంతకంటే ఆ హోటల్‌ యజమానికి చెందిన బంగ్లాలో హౌస్‌కీపర్‌గా ఉన్నారు. పటేల్ హోటల్ ఆవరణలోని ఒక ఇంట్లో నివసించేవాడు. అతడి తండ్రి ఉనాలో రైతు. ఆయనకు ఉనాలో ఓ ఇల్లు కూడా ఉంది. పటేల్‌ చనిపోయే ముందు ఆస్తి మొత్తానికి తన మనవడే వారసుడని పేర్కొన్నారు. తాను సావ్జీ పటేల్ ప్రత్యక్ష వారసుడినని, అందువల్ల షేర్ల విలువ మొత్తం తనకే దక్కుతుందని పటేల్‌ కుమారుడు వాదిస్తున్నాడు. అయితే, మనవడు వాటిని ఇవ్వడానికి నిరాకరించాడు. అతడికి చెందిన ఇంట్లో ఆ పత్రాలు దొరికాయి కాబట్టి మొత్తం తనకే దక్కుతుందని మొండిగా వాదించసాగాడు. దీంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. తండ్రీ, కొడుకుల్లో ఎవరికి కొట్లు దక్కుతాయనే దానిపై గుజరాత్‌ హైకోర్టు నవంబరు 3న విచారణలో తేల్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.