Elephants: ఏనుగు శాఖాహారా? మాంసాహారా? సమాధానం మీరు ఊహించలేరు
ఏనుగు అడవిలో అతిపెద్ద జంతువు. పుట్టినప్పుడే ఏనుగు పిల్ల బరువు దాదాపు 90 నుండి 120 కిలోల వరకు ఉంటుంది. ఆ తర్వాత అది క్రమంగా భారీ ఎత్తున బరువు పెరుగుతుంది. అయితే ఇంత బరువు పెరగడానికి అసలు ఏనుగు శాఖాహారా లేక మాంసాహారా అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా?
Updated on: Oct 29, 2025 | 5:14 PM

ఏనుగు అడవిలో అతిపెద్ద జంతువు. పుట్టినప్పుడే ఏనుగు పిల్ల బరువు దాదాపు 90 నుండి 120 కిలోల వరకు ఉంటుంది. ఆ తర్వాత అది క్రమంగా భారీ ఎత్తున బరువు పెరుగుతుంది. అయితే ఇంత బరువు పెరగడానికి అసలు ఏనుగు శాఖాహారా లేక మాంసాహారా అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా?

ఒక ఏనుగు ఒకేసారి 150 నుంచి 30 కిలోల ఆహారాన్ని తింటుంది. అలాగే ఒక ఏనుగు పిల్ల ఒకేసారి 10 నుండి 12 లీటర్ల పాలు తాగుతుంది. ఇలా ఆహారం తిన్న తర్వాత ఒక ఏనుగు ఒకేసారి 10 నుంచి 14 లీటర్ల నీరు తాగుతుంది.

ఏనుగు శాఖాహారా లేక మాంసాహారా అనే సందేహం చాలా మందికి ఉండవచ్చు. కొంతమందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి ఉండవచ్చు. కానీ చాలా మందికి ఈ విషయంలో క్లారిటీ ఉండదు.

నిజానికి, ఏనుగులు పూర్తిగా శాఖాహారులు. అవి పొరపాటున కూడా ఎప్పుడూ మాంసాన్ని ముట్టుకోవు. ఏనుగులు గడ్డి, చెట్ల కొమ్మలు, చిన్న మొక్కలు, చెరకు, అరటిపండ్లు, ధాన్యాలు మాత్రమే తింటాయి.

శాఖాహారం తినడం వల్ల కూడా ఏనుగు శరీరం చాలా బలాన్ని పొందుతుంది. అందుకే పులులు, సింహాలు వంటి పెద్ద మాంసాహారులు కూడా ఏనుగును చూసి భయపడి పారిపోతాయి.