AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేపల కోసం జల్లి లాంటి వల ఏర్పాటు చేశారు.. తీరా చిక్కింది చూడగా..

చేపల కోసం వల వేస్తే.. అందులో ఏవైనా విలువైన వస్తువులు చిక్కితే జాలర్లు మస్త్ ఆనందపడతారు. కానీ ఇక్కడ మాత్రం వారికి భయానక అనుభవం ఎదురైంది. ముసురుకు మంచి చేపలు చిక్కుతాయి అనుకంటే ఊహించని ఝలక్ తగిలింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి ..

Viral Video: చేపల కోసం జల్లి లాంటి వల ఏర్పాటు చేశారు.. తీరా చిక్కింది చూడగా..
Fishing Net
Ram Naramaneni
|

Updated on: Oct 31, 2025 | 7:10 PM

Share

చేపల కోసం ఏర్పాటు చేసిన వలల్లో మొసళ్లు, కొండచిలువలు చిక్కడం మనం చాలాసార్లు చూశాం. కానీ ఇక్కడ అంతకంటే డేంజరస్ జీవి మరొకటి అందులో చిక్కుకుంది. బీహార్‌లోని బంకా జిల్లా అమర్‌పూర్ బ్లాక్‌లోని డిగ్గి గ్రామంలో గల పాన్ ఆనకట్ట వద్ద సోమవారం ఉదయం ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు ఏర్పాటు చేసి వలలో చేపలతో పాటు ఒక పెద్ద నాగుపాము, మరో విష రహిత పాము చిక్కుకున్నట్లు గుర్తించారు. స్థానిక గ్రామస్తులు చేపలు పట్టడానికి ఆనకట్టలో వల లాంటి జల్లిని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం.. ఒక వ్యక్తి చేపలు ఏమైనా చిక్కాయేమో అని చూసేందుకు వెళ్లాడు. అందులో కొన్ని చిన్న చేపలతో పాటు తాచచుపాము బుసలు కొడుతూ కనిపించడంతో అతను షాక్ అయ్యాడు. దీంతో అతను ఇతర గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. గ్రామస్తులు ఆ పామును చంపకూడదని నిర్ణయించుకున్నారు. అలే చేస్తే పాపం తగులుతుందని భావించారు.

చాలా జాగ్రత్తగా వారంతా ఆ పెద్ద నాగుపాముని వలలోంచి విడిపించి అడవికి సమీపంలో సురక్షితంగా వదిలేశారు. ఈ ఆనకట్ట వద్ద ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. ఈ మొత్తం ఘటన ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. గ్రామస్తులు చేసిన పనిని వన్యప్రాణి ప్రేమికులతో పాటు.. అటవీ సిబ్బంది అభినందిస్తున్నారు. వర్షాకాలంలో పాములు తరచుగా పొలాల్లో కనిపిస్తాయని.. కొన్నిసార్లు జనావాస ప్రాంతాలలోకి కూడా ప్రవేశిస్తాయని స్థానికులు చెబుతున్నారు. వాటికి హాని కలిగించవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..