AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premature Babies: భారత దేశంలో నెలల నిండకుండానే పుడుతున్న పిల్లలు అధికం.. ఐదేళ్ల లోపు శిశు మరణాలు ఎక్కువే అంటున్న

2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 1.34 కోట్ల మందికి పైగా పిల్లలు నెలలు నిండకుండానే జన్మించారని అంచనా వేసినట్లు ఈ నివేదికలో  పేర్కొంది. ఈ మృతుల్లో 30 లక్షల మంది చిన్నారులు భారత్‌కు చెందిన వారు. అంటే ఇది ప్రపంచంలోని నెలలు నిండని శిశువులలో 22 శాతం.

Premature Babies:  భారత దేశంలో నెలల నిండకుండానే పుడుతున్న పిల్లలు అధికం.. ఐదేళ్ల లోపు శిశు మరణాలు ఎక్కువే అంటున్న
Premature Birth In India
Surya Kala
|

Updated on: May 25, 2023 | 1:23 PM

Share

ఓ వైపు భారత దేశం ప్రపంచంలో అత్యధిక జనాభాకలిగిన దేశంగా రికార్డ్ కెక్కితే.. మరోవైపు ఆందోళన కలిగిస్తూ నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు ఏటా లక్షల్లో మరణిస్తున్నారు. ప్రపంచంలోనే భారత దేశంలో జననాల రేటు అధికంగా ఉంది.. అదే సమయంలో శిశువు తొమ్మిది నెలల కంటే ముందే జన్మిస్తున్నారని.. అయితే ఇటువంటి జననాల వలన మరణాలు కూడా అధికంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సమస్య భారత దేశంలో అతి పెద్దదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘బోర్న్ టూ సూన్’ పేరుతో ఒక నివేదికను సమర్పించింది. 2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 1.34 కోట్ల మందికి పైగా పిల్లలు నెలలు నిండకుండానే జన్మించారని అంచనా వేసినట్లు ఈ నివేదికలో  పేర్కొంది. ఈ మృతుల్లో 30 లక్షల మంది చిన్నారులు భారత్‌కు చెందిన వారు. అంటే ఇది ప్రపంచంలోని నెలలు నిండని శిశువులలో 22 శాతం. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం తర్వాత నెలలు నిండకుండానే శిశువులు జన్మించే దేశాల్లో ప్రధానమైనవి పాకిస్థాన్, నైజీరియా, చైనా, ఇథియోపియా. అయితే భారతదేశంలో అకాల పుట్టుక ఎందుకు సాధారణంగా మారింది.. ఇలాంటి జననాల వలన కలిగే ప్రమాదం గురించి తెలుసుకుందాం..

అకాల పుట్టుక అంటే ఏమిటంటే? 

ప్రీ మెచ్యూర్ బేబీ జననం అంటే 37 వారాల ముందు బిడ్డ పుడితే పిల్లల అకాల జననం అంటారు. గర్భధారణను బట్టి ముందస్తు జననానికి అనేక ఉప వర్గాలు ఉన్నాయి. 28 వారాలలోపు నవజాత శిశువు పుట్టడాన్ని అత్యంత ముందస్తు జననం అంటారు. మరో వైపు, 28 వారాల నుండి 32 వారాల మధ్య జన్మించిన పిల్లలను చాలా ముందస్తు జననాలు అంటారు. మరోవైపు, 32 వారాల నుండి 37 వారాల మధ్య జన్మించిన బిడ్డను మధ్యస్థ ముందస్తు జననం కేటగిరీ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇండియా టుడే నివేదిక ప్రకారం.. AIIMS పాట్నాలోని నియోనాటాలజీ విభాగం అధిపతి డాక్టర్ భబేష్‌కాంత్ చౌదరి మాట్లాడుతూ.. పుట్టిన పిల్లల్లో దాదాపు 50 శాతం మంది పిల్లలకు నెలలు నిందలేదని చెప్పారు. వీరిలో 10 నుంచి 20 శాతం మంది చాలా నెలలు నిండకుండానే పుడుతున్నారని పేర్కొన్నారు.

నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడానికి కారణాలు ఏమిటంటే? 

చాలా మంది గర్భణీల్లో శిశువుల జననం ఆకస్మికంగా జరుగుతాయి. అయితే కొందరి గర్భణిలో ఇన్ఫెక్షన్ లేదా ప్రెగ్నెన్సీ సమస్యల వల్ల కూడా శిశువు నెలలు నిండకుండానే పుడతారు. ధూమపానం, మద్యం సేవించడం, ఇన్‌ఫెక్షన్‌, ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌, క్రానిక్‌ హార్ట్‌ డిసీజ్‌, డయాబెటిస్‌ తదితర అంశాలు నెలలు నిండకుండానే ప్రసవానికి దారితీస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు మరణించే పిల్లల్లో నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల సంఖ్య అత్యధికంగా ఉంది. మరోవైపు  అకాల జననం వలన  అన్ని వయసుల వారిని పరిగణలోకి తీసుకుంటే అకాల పుట్టుక, గుండె జబ్బులు, న్యుమోనియా, డయేరియా తర్వాత ప్రపంచంలో మరణాలకు ఇది నాల్గవ అతిపెద్ద కారణంగా పేర్కొన్నారు.

తక్కువ ఆదాయ దేశాలలో 90 శాతం కంటే ఎక్కువ మంది శిశువులు నెలలు నిండకుండా పుడితే రోజుల  వ్యవధిలో మరణిస్తారు. భారతదేశంలో కూడా పరిస్థితి అంత బాగా లేదు. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు ప్రకారం ప్రపంచంలోని 200 దేశాల జాబితాలో భారత్ 59వ స్థానంలో ఉంది. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు ముందంజలో ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రీ మెచ్యూర్ బేబీ మరణాల రేటు గత మూడు దశాబ్దాలలో గణనీయంగా తగ్గింది. ప్రపంచ సగటు కంటే భారతదేశంలో మరణాల రేటు మెరుగ్గా ఉన్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..