Sengol History: అధికార బదిలీకి చిహ్నం రాజదండం.. మహాభారతంలో దీని ప్రస్తావన.. ఈ సంప్రదాయం ఏఏ దేశాల్లో ఉందంటే

హిందూ పురాణాల్లో పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని శాంతిపర్వ అధ్యాయం రాజ ధర్మానుశాసన అధ్యాయంలో రాజదండం గురించి ప్రస్తావన ఉంది. ఇందులో అర్జునుడు యుధిష్ఠిరునికి రాజదండం ప్రాముఖ్యతను వివరించాడు.

Sengol History: అధికార బదిలీకి చిహ్నం రాజదండం.. మహాభారతంలో దీని ప్రస్తావన.. ఈ సంప్రదాయం ఏఏ దేశాల్లో ఉందంటే
Sengol History
Follow us
Surya Kala

| Edited By: seoteam.veegam

Updated on: May 28, 2023 | 1:58 PM

బ్రిటిష్ కుటుంబం పట్టాభిషేక కార్యక్రమంలో కింగ్ చార్లెస్ III కి ఒక  పొడవాటి కర్రలాంటి దండాన్ని  అందజేశారు. కొంచెం శ్రద్ద పెట్టి గత చరిత్రను పరిశీలిస్తే.. రోమ్ రాజు జూలియస్ సీజర్ చిత్రాన్ని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే..  అతని చేతిలో పొడవాటి కర్రను చూస్తారు. అంతేకాదు ఈజిప్ట్ , మెసొపొటేమియా రాజ్య పాలకులను చూసినా ఒక పొడవాటి కర్ర దర్శనమిస్తుంది. అయితే ఇప్పుడు మన దేశం పార్లమెంట్ ప్రారంభం సందర్భంలో మళ్ళీ రాజా దండం ప్రస్తావన తెరపైకి వచ్చింది. భారతదేశం కొత్త పార్లమెంట్ హౌస్‌లో ఈ రాజదండం అంటే సెంగోల్ స్పీకర్ సీటుకు సమీపంలో అమర్చబడుతుంది. సెంగోల్ తమిళ భాషా పదం సెమ్మై నుండి ఉద్భవించింది. సెంగోల్  అంటే సాహిత్యపరమైన అర్థం సత్యం, ధర్మం, విధేయత. 1947లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దీనిని అధికార మార్పిడిగా బ్రిటిష్ వారి నుంచి తీసుకున్నారు.

రాజదండం ప్రాముఖ్యత ఏమిటంటే

పట్టాభిషేకం తర్వాత ఏ రాజుకైనా ఈ  రాజ దండాన్ని అప్పగిస్తారు. భారతదేశంలో ఈ రాజదండము చేపట్టే  ప్రక్రియ జరిగే సమయంలో పట్టాభిషేకానికి ముందు తిలకధారణ చేస్తారు. చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే,  తలపై కిరీటం ఉన్న వ్యక్తి రాజుగా పరిగణిస్తారు. ఈ కిరీటం రాష్ట్ర అధికారంతో ముడిపడి ఉంటుంది. అయితే  రాజు చేతిలో రాజదండం ఉన్నప్పుడే రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు అందుబాటులో ఉంటుంది. పూర్వకాలంలో రాజు తన అధికారాన్ని మరొకరికి ఇచ్చే సమయంలో లేదా ఏదైనా పర్యటనకు వెళ్లే సమయంలో ఈ రాజదండం అప్పగించి పాలన చేయమని సూచించేవారు.

మహాభారతంలో రాజదండం ప్రస్తావన

హిందూ పురాణాల్లో పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని శాంతిపర్వ అధ్యాయం రాజ ధర్మానుశాసన అధ్యాయంలో రాజదండం గురించి ప్రస్తావన ఉంది. ఇందులో అర్జునుడు యుధిష్ఠిరునికి రాజదండం ప్రాముఖ్యతను వివరించాడు. అర్జునుడు ఇలా అన్నాడు- ‘ఈ రాజ దండము రాజుకి కర్ర మాత్రమే కాదు.. రాజ్యాన్ని, అర్ధాన్ని అంటే సంపదని రక్షించే ఆయుధం. అందుకే రాజు అయిన మీరు ఈ రాజదండాన్ని ధరించాలి అని చెప్పారు. ఇక్కడ రాజదండం అంటే అర్ధం.. రాజు ఎవరినై తప్పు చేసిన వారిని శిక్షించే హక్కుని ఇచ్చింది అని అర్ధం. ఇంకా అర్జునుడు రాజదండము గురించి చెబుతూ.. ఎవరైనా పాపం చేయాలంటే ఈ రాజదండం శిక్షిస్తుంది అనే భయం వల్ల పాపం చేయరని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో రాజదండం

మౌర్య, గుప్త రాజవంశంలో కూడా రాజదండము చేపట్టిన సంప్రదాయం ఉండేదని కొందరు చరిత్రకారుల కథనం. అయితే భారతదేశంలోని అధికార శక్తికి చిహ్నంగా రాజదండం పరిగణించడం ప్రారంభం చోళ రాజవంశం నుంచి మొదలైందని విశ్వాసం. సెంగోల్‌పై ప్రభుత్వం విడుదల చేసిన బ్రోచర్‌లో.. చోళ రాజవంశ సంప్రదాయంగా పరిగణించబడినట్లు తెలుస్తోంది.

భారతదేశాన్ని 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు చోళ సామ్రాజ్యాన్ని విస్తరించి ఉంది. ఇది భారతదేశపు అతిపెద్ద సామ్రాజ్యంగా పరిగణించబడుతుంది. చోళ సామ్రాజ్యం తర్వాత, విజయనగర సామ్రాజ్యంలో కూడా సెంగోల్ అంటే రాజదండం ఉపయోగించినట్లు చెబుతారు. కొంతమంది చరిత్రకారులు ఈ రాజదండము సంప్రదాయాన్ని మొఘలులు.. తర్వాత బ్రిటిష్ కొనసాగించినట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోని అనేక దేశాలలో రాజదండం సంప్రదాయం ఉంది

రాజుకు రాజదండం ఇచ్చే సంప్రదాయం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉంది. 1661లో చార్లెస్ II పట్టాభిషేకం సమయంలో సావరిన్ ఆర్బ్ మొదటిసారిగా తయారు చేయబడిందని చెబుతారు. ఇటీవల దీనిని కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకలో కూడా ఉపయోగించారు. ఈజిప్టులో కూడా రాజదండం రాజు అధికారాలకు కేంద్రంగా పరిగణించబడింది. అయితే ఈజిప్ట్ లో రాజదండాన్ని వాజ్ అని పిలుస్తారు. ఇక మెసొపొటేమియాలో.. గిద్రు రాజు చేతిలో రాజదండం ఉండేది. రాజదందాని చేపట్టి రోమన్ రాజులు పాలన సాగించారు. రోమన్  సామ్రాజ్యంలో ముఖ్యమైన పదవులు నిర్వహించిన వ్యక్తులకు రాజదండం కూడా ఇవ్వబడినట్లు చరిత్రకారుల కథనం.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!