- Telugu News Photo Gallery Gujarath: rajkot students birthdays are celebrated in a unique way in this school in the city
Birthday Celebration: అక్కడ స్కూల్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ డిఫరెంట్.. యజ్ఞం చేస్తూ కొన్ని ప్రమాణాలు చేయాల్సిందే.
పుట్టిన రోజు వస్తుందంటే చాలు పిల్లలకు సంతోషం. తమ పుట్టిన రోజుకి కొత్త బట్టలు ధరించడం, తమ స్నేహితులకు, టీచర్స్ కు తోటి విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెడతారు. మరికొందరు తమ ఫ్రెండ్స్, తల్లిదండ్రుల మధ్య కేక్ కట్ చేసి వేడుకగా జరుపుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే గుజరాత్ రాష్ట్రంలోని ఓ స్కూల్ లో మాత్రం స్టూడెంట్స్ పుట్టిన రోజు వేడుకలు భిన్నంగా జరుపుకుంటారు. రాజ్‌కోట్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థుల పుట్టినరోజున ఒక యాగశాల సంప్రదాయాన్ని పాటిస్తూ యజ్ఞం నిర్వహిస్తారు.
Updated on: May 23, 2023 | 12:29 PM

రాజ్‌కోట్‌లోని రైల్‌నగర్‌లోని కర్ణావతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న ప్రతి చిన్నారి పుట్టిన రోజున హిందూ సాంప్రదాయ పద్దతిలో జరుపుతారు. తమ స్టూడెంట్ పుట్టిన రోజు సందర్భంగా యజ్ఞం చేయాలనే నిబంధన పెట్టారు. పుట్టినరోజు జరుపుకునే స్టూడెంట్స్ విధిగం యజ్ఞయాగాన్ని నిర్వహిస్తారు.

ఈ స్కూల్ లో స్టూడెంట్ పుట్టినరోజున యజ్ఞం చేయడానికి ప్రత్యేక పండితుడు కూడా ఉన్నారు. యజ్ఞంలో పిల్లలకు అవిస్సుని సమర్పించే సమయంలో, నైవేద్యాలు సమర్పించే సమయంలో ఆ పండితుడు శ్లోకాన్ని పఠిస్తూ పిల్లలకు ఆ శ్లోకాల అర్థాన్ని కూడా వివరిస్తాడు.

పుట్టిన రోజు ఉదయం పాఠశాలకు రాగానే ముందుగా చేసేది యజ్ఞం. అంతేకాదు పుట్టిన రోజు జరుపుకునే స్టూడెంట్స్ కు హిందూ సంప్రదాయంలో విశిష్టతను వివరిస్తారు.. సనాతన ధర్మంలోని నియమాలతో ప్రమాణాన్ని చేయిస్తారు.

నేను నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను, గౌరవిస్తాను, నా గురువులను గౌరవిస్తాను, వృద్ధులకు సహాయం చేస్తాను, వ్యసనాలకు దూరంగా ఉంటాను, మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంటాను, పరీక్షలను దొంతనంగా రాయను, ఎవరి వస్తువులూ దొంగతనం చేయను వంటి ప్రమాణాలు యజ్ఞం చేసే సమయంలో చేస్తారు.

అంతేకాదు కాదు యజ్ఞానికి సంబంధించిన గ్రంథాలను వివరించే విభిన్న చిత్రాలు కూడా యజ్ఞశాల చుట్టూ ఏర్పాటు చేశారు. పుట్టిన రోజు జరుపుకునే పిల్లలు మాత్రమే కాదు.. స్కూల్ లో చదువుతున్న ఇతర స్టూడెంట్స్ కూడా అప్పుడప్పుడు యజ్ఞంలో పాల్గొంటారు.




