Watch Video: దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు.. 75 ఏళ్ల తరువాత కలిశారు.. వారి ఆనందాన్ని వర్ణించలేం..
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిని చూస్తే కొన్ని నవ్వు తెప్పిస్తాయి.. మరికొన్ని మీకు తెలియకుండానే కన్నీళ్లు తెప్పిస్తాయి. మరికొన్ని మనసుకు హత్తుకుంటాయి. సాధారణంగా మనం మన కుటుంబాన్ని ఒకటి లేదా రెండు సంవత్సరాలు.. పోనీ గరిష్టంగా ఐదు, పదేళ్లు విడిచి ఉంటే మనసంతా అదోలా ఉంటుంది.

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిని చూస్తే కొన్ని నవ్వు తెప్పిస్తాయి.. మరికొన్ని మీకు తెలియకుండానే కన్నీళ్లు తెప్పిస్తాయి. మరికొన్ని మనసుకు హత్తుకుంటాయి. సాధారణంగా మనం మన కుటుంబాన్ని ఒకటి లేదా రెండు సంవత్సరాలు.. పోనీ గరిష్టంగా ఐదు, పదేళ్లు విడిచి ఉంటే మనసంతా అదోలా ఉంటుంది. కానీ, వీరు ఐదు కాదు, పది కాదు.. ఏకంగా 75 ఏళ్లు దూరంగా ఉన్నారు. అవును మీరు విన్నది నిజంగా నిజం. భారత్-పాక్ దేశ విభజన సమయంలో విడిపోయిన ఓ అక్కా, తమ్ముడు.. 75 ఏళ్ల తరువాత మళ్లీ కలుసుకున్నారు. వీరి కలయికకు కర్తార్‌పూర్ వేదికగా నిలిచింది. 1947లో భారత్, పాకిస్తాన్ విడిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సోదరుడు, సోదరి విడిపోయారు. నాటి నుంచి వారు ఏనాడూ కలుసుకోలేదు. కానీ, చాన్నాళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఒక్కటయ్యారు.
భారత్‌లో ఉంటున్న 81 ఏళ్ల మహేంద్ర కౌర్ తన కుటుంబంతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా భారతదేశం నుండి గురుద్వారాకు ప్రయాణించారు. మరోవైపు, అతని 78 ఏళ్ల సోదరుడు షేక్ అబ్దుల్ అజీజ్ తన కుటుంబంతో కలిసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి కర్తార్‌పూర్ చేరుకున్నాడు. వృద్ధులిద్దరూ గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్‌లో కలుసుకున్నారు.




తోబుట్టువుల వీడియోను PMU (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్) కర్తార్‌పూర్ అధికారి ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇందులో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం చూడవచ్చు. చాన్నాళ్ల తరువాత కలుసుకోవడంతో వీరిద్దరూ ఆనందంతో మునిగిపోయారు. 75 ఏళ్ల తర్వాత ఒకరినొకరు తనివితీరా చూసుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా వారు తమ గతాన్ని నెమరువేసుకున్నారు. ఇక వారి తల్లిదండ్రులను కోల్పోయిన బాధను పంచుకోవడం కాస్త ఉద్వేగభరితమైన వాతావరణాన్ని సృష్టించింది. అయినప్పటికీ.. ఇన్నాళ్ల తరువాత ఇరువురు కలవడంతో ఆ రెండు కుటుంబాలు ఆనందంలో మునిగి తేలాయి.
అసలేం జరిగింది..
1947 విభజన సమయంలో, పంజాబ్‌లో నివసిస్తున్న సర్దార్ భజన్ సింగ్ కుటుంబం విషాదకరంగా విడిపోయింది. నాటి పరిస్థితుల నేపథ్యంలో విభజన తర్వాత, అజీజ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వెళ్లారు. అతని కుటుంబ సభ్యులు భారతదేశంలోనే ఉన్నారు. కుటుంబం నుంచి విడిపోయి ఎన్నో ఏళ్లు వేదనతో గడిపానని అజీజ్ తన బాధను పంచుకున్నారు. తనవాళ్లను వెతకడానికి ప్రయత్నించినప్పటికీ.. తప్పిపోయిన తల్లిదండ్రుల గురించి, బంధువుల గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఆ తరువాత పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగించాడు. పెళ్లి, పిల్లలు అన్నీ చకచకా జరిగిపోయాయి. అయినప్పటికీ.. తప్పిపోయిన తన కుటుంబ సభ్యులను తిరిగి కలవాలని ఎప్పుడూ ఆలోచించేవాడు. అతని కుటుంబం కూడా వారి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించింది.
కర్తార్‌పూర్ కారిడార్: విడిపోయిన వారు కలిసే ప్రదేశం..
విభజన సమయంలో తన సోదరి నుండి విడిపోయిన వ్యక్తి వివరాలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చూసినట్లు మహేంద్ర కౌర్ కుటుంబ సభ్యులు వీడియోలో వెల్లడించారు. ఈ పోస్ట్ ద్వారా.. రెండు కుటుంబాలు కలిశాయి. మహేంద్ర, అజీజ్ ఇద్దరూ ఒక్కటయ్యారు. రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి.
ఈ సంతోషకరమైన సన్నివేశాన్ని గుర్తించిన కర్తార్‌పూర్ నిర్వాహకులు.. ఇరు కుటుంబాలకు స్వీట్స్ పంచారు. ఇక కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్టుకు కృతజ్ఞతలు తెలిపిన మోహిందర్ సింగ్.. భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలను ప్రశంసించారు. ఈ కారిడార్ రెండు కుటుంబాలను, చాలా కాలంగా కోల్పోయిన ప్రేమ, సాన్నిహిత్యాన్ని తిరిగి కలపడానికి చాలా కృషి చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇలాంటి కలయికలకు వేదికగా నిలుస్తున్న, ప్రేమ, శాంతి, సమైక్యతను పెంచుతున్న కర్తార్‌పూర్ కారిడార్‌ను సమైక్యత కారిడార్ అని కూడా పిలుస్తారు. గతేడాది జనవరిలో కూడా ఎప్పుడో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు కర్తార్‌పూర్ కారిడార్ వేధికగా మళ్లీ కలిశారు. 80 ఏళ్ల ముహమ్మద్ సిద్ధిక్, 78 ఏళ్ల హబీబ్ ఒకరినొకరు కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
An other separated family meetup at kartarpur Corridor (a Corridor of Peace). Mr sheikh Abdul Aziz and his sister Mohinder kaur who got separated at the time of partition in 1947 met at Gurdwara Sri Darbar Sahib kartarpur. Both families were very happy and praised the government pic.twitter.com/TACb7O7SjH
— PMU Kartarpur Official (@PmuKartarpur) May 20, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..