Sengol in New Parliament: ఒక్క లేఖతో తెరపైకి ‘రాజదండం’.. మోడీ ప్రభుత్వం నిర్ణయం వెనుక అంత కథ ఉందా..?

Sengol in New Parliament: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న (ఆదివారం) ప్రారంభించనున్నారు. అయితే, ప్రారంభోత్సవంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. స్పీకర్ కూర్చి దగ్గర చారిత్రాక రాజదండాన్ని (సెంగోల్) ను ఉంచుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.

|

Updated on: May 25, 2023 | 12:57 PM

Sengol in New Parliament: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న (ఆదివారం) ప్రారంభించనున్నారు. అయితే, ప్రారంభోత్సవంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. స్పీకర్ కూర్చి దగ్గర చారిత్రాక రాజదండాన్ని (సెంగోల్) ను ఉంచుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు. బ్రిటిష్ వారు భారతీయులకు అధికారాన్ని (స్వాతంత్ర్యం) అప్పగిస్తూ.. ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించారు.

1 / 7
ఈ రాజదండాన్ని “సెంగోల్” అని పిలుస్తారు. ఇది తమిళ పదం “సెమ్మై” నుంచి ఉద్భవించింది.. దీని అర్థం “ధర్మం”.. బంగారు ‘సెంగోల్’ (రాజదండం) స్వాతంత్ర్యానికి ‘ముఖ్యమైన చారిత్రక’ చిహ్నమని.. ఇది బ్రిటిష్ వారి నుంచి అధికారాన్ని భారతీయులకు బదిలీ చేయడాన్ని సూచిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆగస్ట్ 14, 1947 రాత్రి 10.45 గంటల సమయంలో.. పండిట్ నెహ్రూ తమిళనాడులో బ్రిటిష్ వారి నుంచి ఈ రాజదండంను స్వీకరించారు. పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో.. ఆయన దీనిని స్వాతంత్ర్యానికి చిహ్నంగా అంగీకరించారు.

2 / 7
అసలు రాజదండంను పార్లమెంట్‌లో ఉంచాలన్న నిర్ణయం వెనుక ఓ ప్రముఖ నృత్య కళాకారిణి ఉన్నారు. ఈ రాజదండం గురించి ప్రముఖ నృత్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. అంతేకాకుండా పలు పరిశోధనలను కూడా ప్రచురించారు. అయితే. లేఖ తర్వాత బంగారు రాజదండం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పలువురు అధికారులతో పరిశోధన నిర్వహించి.. ఆ తర్వాత పార్లమెంట్‌లో ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది.

3 / 7
1947లో భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు సెంగోల్‌ను అప్పగించినప్పుడు జరిగిన వేడుక వివరాలను ప్రచురించిన తమిళ పత్రిక తుగ్లక్‌లో డా. సుబ్రహ్మణ్యం ఒక కథనాన్ని ఉటంకించారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కథనం మే 2021లో కనిపించింది. ప్రముఖ నర్తకి, పరిశోధకురాలు ఆ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సమాచారాన్ని బహిరంగపరచవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

4 / 7
ఈ లేఖ చారిత్రాత్మక సంఘటనను పునఃపరిశీలించటానికి దారితీసింది. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (IGNCA) నుంచి నిపుణుల సహాయంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బృందం నివేదికలపై పరిశోధనను ప్రారంభించింది. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి నెహ్రూ జాతీయ జెండాను ఎగురవేసి, ప్రసంగించే ముందు సెంగోల్ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. దీనిని అప్పటినుంచి.. ఇప్పటి వరకు ప్రయాగ్‌రాజ్ మ్యూజియంలో ఉంచారు.

5 / 7
బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడం కోసం భారత ప్రభుత్వం తమిళనాడు చోళ రాజుల పవిత్రమైన సెంగోల్-వెస్టింగ్ నమూనాను అనుసరించింది. పవిత్రమైన తమిళ వచనమైన తేవరం పాడే మధ్య అప్పటి ప్రధానమంత్రికి సెంగోల్‌ను అప్పగించారు. దైవిక ఆశీర్వాదాలకు ప్రతీక, న్యాయంగా, ధర్మంగా పాలించమని ఆజ్ఞ.. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, సమకాలీన వార్తాపత్రికలు, పుస్తకాలు అలాగే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న విషయాలపై సమాచారాన్ని పరిశోధకులు పరిశీలించారు.

6 / 7
బంగారు రాజదండంను ఆభరణాలు పొదిగించబడిందని, అప్పటి విలువ రూ.15,000 అని, చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్ పేర్కొంది. వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబం తామే సెంగోల్‌ను తయారు చేసినట్లు ధృవీకరించారు. దీన్ని తయారు చేసిన కుటుంబంలోని పెద్ద 95 ఏళ్లు పైబడినప్పటికీ, వివరాలను గుర్తుకు తెచ్చుకోలేకపోయారు. అయితే, ఈ వేడుక ఫోటో వారి ఇంట్లో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.

7 / 7
Follow us
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్