- Telugu News Photo Gallery Spiritual photos Lucky Zodiac Signs in May 2025: Key Planetary Transits and Their positive Impact
Lucky Zodiac Signs: మేలో రాశి మారుతున్న కీలక గ్రహాలు.. వారి దశ తిరగడం పక్కా..!
Lucky Zodiac Signs in May 2025: ఈ ఏడాది మొత్తంలో మే నెల ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రధాన గ్రహాలన్నీ రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మే 7న బుధుడు మేష రాశిలోకి, 16న రవి వృషభ రాశిలోకి, 18న రాహువు కుంభ రాశిలోకి, అదే రోజున రాహువుతో పాటు కేతువు కూడా సింహ రాశిలోకి, మే 25న గురువు మిథున రాశిలోకి మారుతున్నందువల్ల వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారి జీవితాలు నిత్య కల్యాణం పచ్చ తోరణంలా ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. ఇది రాశులకే కాక లగ్నాలకు కూడా వర్తిస్తుంది.
Updated on: Apr 23, 2025 | 3:01 PM

వృషభం: ఈ గ్రహాల మార్పు వల్ల ఈ రాశివారు అత్యంత అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది. ఆదాయ పరంగా ఊహించని పురోగతి ఉంటుంది. అన్ని విధాలుగానూ ఆదాయం బాగాకలిసి వస్తుంది. రాశ్యధిపతి శుక్రుడు కూడా ఉచ్ఛలో ఉన్నందువల్ల కుబేర, లక్ష్మీయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి యోగం, సంతాన యోగం కలిగే అవకాశం ఉంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలోకి ప్రవేశించడం, దశమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వంటి కారణాల వల్ల ఈ నెలంతా వీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఛాన్సులు కూడా లభిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి మే నెలతో తప్పకుండా దశ తిరుగుతుంది. రాశ్యధిపతి రవి 14న దశమస్థానంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఉద్యోగ పరిస్థితులు బాగా సానుకూలంగా మారుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సొంత ఇల్లు ఏర్పడే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి ధన యోగాలు, అధికార యోగాలు పట్టబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగానే కాకుండా కుటుంబంలో కూడా కొన్నిముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. సంతాన ప్రాప్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.

ధనుస్సు: ఈ రాశికి రాశ్యధిపతి గురువుతో పాటు, రాహువు కూడా శుభ యోగాలనివ్వడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోయి, నెలంతా నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం: ఈ రాశివారికి బుధ, గురు, రవి, రాహువుల అనుకూలత వల్ల అంచనాలకు మించిన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఆర్థిక అవసరాలు తగ్గిపోతాయి. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశముంది.



