AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితంలో ఒక్కసారైనా కాశీ పోవాల్సిందే..! తప్పక చూడాల్సిన పవిత్ర ఘాట్‌లు ఇవే..

అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ మొట్టమొదటి వరుసలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్​లోని ఈ కాశీ నగరాన్నే వారణాసి, బనారస్​అని కూడా పిలుస్తారు. ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలూ నశించి తిరిగి పునర్జన్మ ఉండదని నమ్మకం. అందుకే చాలా మంది కాశీని సందర్శిస్తుంటారు. అయితే, కాశీ వెళ్లినప్పుడు కేవలం విశ్వనాథుడి దర్శనం, గంగా హారతి మాత్రమే కాకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

Jyothi Gadda
|

Updated on: Apr 23, 2025 | 3:56 PM

Share
అస్సీ ఘాట్ - Assi Ghat
 ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఘాట్. అస్సీ ఘాట్ గంగ, అస్సీ నదుల సంగమం వద్ద కొలువై ఉంది. ఇక్కడ చనిపోయిన పెద్దలకు ఎక్కువగా పిండ ప్రధానాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ గంగా నదిలో సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుంది. ఈ ఘాట్‌లో ఉదయం చేసే హారతి కూడా చాలా ప్రసిద్ధి చెందింది.

అస్సీ ఘాట్ - Assi Ghat ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఘాట్. అస్సీ ఘాట్ గంగ, అస్సీ నదుల సంగమం వద్ద కొలువై ఉంది. ఇక్కడ చనిపోయిన పెద్దలకు ఎక్కువగా పిండ ప్రధానాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ గంగా నదిలో సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుంది. ఈ ఘాట్‌లో ఉదయం చేసే హారతి కూడా చాలా ప్రసిద్ధి చెందింది.

1 / 7
దశాశ్వమేధ ఘాట్ - Dashashwamedh Ghat
దశాశ్వమేధ ఘాట్ కాశీ (వారణాసి)లోని అత్యంత ప్రముఖమైన పవిత్రమైన ఘాట్.. కాశీకి వెళ్లినవారు.. ఖచ్చితంగా ఈ ఘాట్ సందర్శించాల్సిందే. ఇది గంగా హారతికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఘాట్ కాశీ విశ్వనాథ ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ రెండు పూటలా గంగా హారతి నిర్వహిస్తారు. కాశీలో ఎక్కువగా సందడిగా ఉండే ఘాట్‌లలో ఇది కూడా ఒకటి.

దశాశ్వమేధ ఘాట్ - Dashashwamedh Ghat దశాశ్వమేధ ఘాట్ కాశీ (వారణాసి)లోని అత్యంత ప్రముఖమైన పవిత్రమైన ఘాట్.. కాశీకి వెళ్లినవారు.. ఖచ్చితంగా ఈ ఘాట్ సందర్శించాల్సిందే. ఇది గంగా హారతికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఘాట్ కాశీ విశ్వనాథ ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ రెండు పూటలా గంగా హారతి నిర్వహిస్తారు. కాశీలో ఎక్కువగా సందడిగా ఉండే ఘాట్‌లలో ఇది కూడా ఒకటి.

2 / 7
హరిశ్చంద్ర ఘాట్ - Harishchandra Ghat
హరిశ్చంద్ర ఘాట్ అనేది రాజా హరిశ్చంద్ర రాజు విశ్వామిత్రుడి పరీక్ష సత్యం, దాతృత్యం కోసం ఇక్కడ కాటికాపరిగా పనిచేసిన చోటు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఘాట్‌లలో ఇది ఒకటి.

హరిశ్చంద్ర ఘాట్ - Harishchandra Ghat హరిశ్చంద్ర ఘాట్ అనేది రాజా హరిశ్చంద్ర రాజు విశ్వామిత్రుడి పరీక్ష సత్యం, దాతృత్యం కోసం ఇక్కడ కాటికాపరిగా పనిచేసిన చోటు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఘాట్‌లలో ఇది ఒకటి.

3 / 7
కేదార్ ఘాట్ - Kedar Ghat
కేదార్ ఘాట్ శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర ఘాట్‌లలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న కేదారేశ్వర్ ఆలయం పేరు మీదుగా ఈ ఘాట్‌కు ఆ పేరు వచ్చింది.

కేదార్ ఘాట్ - Kedar Ghat కేదార్ ఘాట్ శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర ఘాట్‌లలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న కేదారేశ్వర్ ఆలయం పేరు మీదుగా ఈ ఘాట్‌కు ఆ పేరు వచ్చింది.

4 / 7
మణికర్ణికా ఘాట్ - Manikarnika Ghat
మణికర్ణికా ఘాట్ పురాతనం, పవిత్రమైన ఘాట్‌లలో ఒకటి. గంగా నది ఒడ్డున ఉన్న మణికర్ణికా ఘాట్​ను దహన సంస్కారాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పౌరాణిక కథల ప్రకారం, పార్వతి దేవి శివునితో నృత్యం చేస్తున్న సమయంలో ఆమె చెవిపోగు (మణికర్ణిక) ఇక్కడే పడిందని, అందుకే ఈ ఘాట్‌కు మణికర్ణిక అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ శ్మశానంలోని బూడిదతో శివుడికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.

మణికర్ణికా ఘాట్ - Manikarnika Ghat మణికర్ణికా ఘాట్ పురాతనం, పవిత్రమైన ఘాట్‌లలో ఒకటి. గంగా నది ఒడ్డున ఉన్న మణికర్ణికా ఘాట్​ను దహన సంస్కారాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పౌరాణిక కథల ప్రకారం, పార్వతి దేవి శివునితో నృత్యం చేస్తున్న సమయంలో ఆమె చెవిపోగు (మణికర్ణిక) ఇక్కడే పడిందని, అందుకే ఈ ఘాట్‌కు మణికర్ణిక అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ శ్మశానంలోని బూడిదతో శివుడికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.

5 / 7
సింధియా ఘాట్ - Scindia Ghat
సింధియా ఘాట్ సింధియా రాజుల పేరు మీదుగా ఇక్కడ ఘాట్ ఉంది. సింధియా ఘాట్​లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు.

సింధియా ఘాట్ - Scindia Ghat సింధియా ఘాట్ సింధియా రాజుల పేరు మీదుగా ఇక్కడ ఘాట్ ఉంది. సింధియా ఘాట్​లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు.

6 / 7
తులసి ఘాట్ - Tulsi Ghat
తులసి ఘాట్‌కి రామచరితమానస్‌ను రచించిన కవి తులసీదాస్ పేరు మీద ఈ ఘాట్ ఉంది. ఇది పాలరాతితో నిర్మితమైన ఆధునిక మందిరం. రామాయణాన్ని తులసీదాస్‌ ఇక్కడే రచించాడని అంటారు. ఇది 1964లో తెల్లని పాలరాతితో నిర్మించారు. రామచరిత్మానస్ శ్లోకాలు, దృశ్యాలు ఆలయ గోడలపై చెక్కారు. ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

తులసి ఘాట్ - Tulsi Ghat తులసి ఘాట్‌కి రామచరితమానస్‌ను రచించిన కవి తులసీదాస్ పేరు మీద ఈ ఘాట్ ఉంది. ఇది పాలరాతితో నిర్మితమైన ఆధునిక మందిరం. రామాయణాన్ని తులసీదాస్‌ ఇక్కడే రచించాడని అంటారు. ఇది 1964లో తెల్లని పాలరాతితో నిర్మించారు. రామచరిత్మానస్ శ్లోకాలు, దృశ్యాలు ఆలయ గోడలపై చెక్కారు. ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

7 / 7