- Telugu News Photo Gallery Cinema photos Director Krish films not released on time, What is reason behind?
Krish: క్రిష్ టైమింగ్ మిస్సయిందా.. సినిమాలు టైమ్‌కు ఎందుకు రావట్లేదు..?
హరిహర వీరమల్లు సినిమా వదిలేసుకుని దర్శకుడు క్రిష్ ఏం సాధించారు..? పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యమవుతుందనే కదా.. మరో ప్రాజెక్ట్ ఓకే చేసారీయన. మరి ఆ సినిమా కూడా ఇప్పుడు లేట్ అవుతుంది. మరి వీరమల్లు వదిలేసుకుని క్రిష్ సాధించిందేంటి..? అసలు ఈయన సినిమాలు ఎందుకు అనుకున్న టైమ్‌కు రావట్లేదు..?
Updated on: Apr 23, 2025 | 12:00 PM

ఒకప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే.. పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ టైమ్‌కు రిలీజ్ చేస్తానంటే.. రిలీజ్ చేసేవాడు అంతే. అందులో ఒక్కరోజు కూడా ఆలస్యం ఉండేది కాదు. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను 80 రోజుల్లో.. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలను 79 రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత క్రిష్ సొంతం.

చాలా వేగంగా సినిమాలు తెరకెక్కిస్తారు అనే పేరు క్రిష్‌కు ఉంది ఇండస్ట్రీలో. అంతెందుకు హరిహర వీరమల్లు మొదలుపెట్టిన తర్వాత.. కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనూ తక్కువ మంది టీంతో కొండపొలం సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేసారు క్రిష్.

అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న క్రిష్ ఈ మధ్య ఒక్క సినిమా కూడా టైమ్‌కు పూర్తి చేయట్లేదు. ఏ ముహూర్తంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ ఒప్పుకున్నారో తెలియదు గానీ.. అప్పట్నుంచే ఆయన సినిమాలు టైమ్‌కు రావట్లేదు.

హరిహర వీరమల్లు సినిమా కోసం రెండేళ్లకు పైగానే కష్టపడ్డారు ఈ దర్శకుడు. ఆలస్యం అవుతుండటంతో క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత వీరమల్లును టేకప్ చేస్తున్నారు ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ.

హరిహర వీరమల్లు నుంచి బయటికొచ్చేసి.. అనుష్క శెట్టి ఘాటీ సినిమాతో బిజీ అయిపోయారు క్రిష్. ఈ సినిమా షూటింగ్ అయిపోయినా కూడా ఇప్పటికీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. ఏప్రిల్ 18న విడుదలన్నారు గానీ ఆ డేట్ వెళ్లిపోయినా.. ఇప్పటికీ సైలెంట్‌గా ఉన్నారు మేకర్స్. మొత్తానికి వీరమల్లు వదిలేసిన తర్వాత కూడా క్రిష్‌కు ఆలస్యం అయితే తప్పట్లేదు.




