AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అయ్యో ఆటో ఆపండి అయ్యా.. అక్కడ ఉన్నది నా కొడుకు బండి అయ్యా..!

అయ్యో ఆటో ఆపండి అయ్యా.. ఆక్కడ చనిపోయింది నా కొడుకు అయ్యా.. ఆ బండి నా కొడుకుది.. ఆ అంగి నా కొడుకుది అయ్యా.. అక్కడ నా కొడుకే పడిపోయినట్టున్నాడు.. ఆటో ఆపండి అయ్యా..అంటు ఆ తల్లి ఆటో ఆపి పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకును చూసి భోరుమన్నది. వారం రోజుల్లో పెళ్లి కావల్సి కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరు అయింది.

Andhra Pradesh: అయ్యో ఆటో ఆపండి అయ్యా.. అక్కడ ఉన్నది నా కొడుకు బండి అయ్యా..!
Road Accident
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 23, 2025 | 6:04 PM

Share

అయ్యో ఆటో ఆపండి అయ్యా.. ఆక్కడ చనిపోయింది నా కొడుకు అయ్యా.. ఆ బండి నా కొడుకుది.. ఆ అంగి నా కొడుకుది అయ్యా.. అక్కడ నా కొడుకే పడిపోయినట్టున్నాడు.. ఆటో ఆపండి అయ్యా..అంటు ఆ తల్లి ఆటో ఆపి పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకును చూసి భోరుమన్నది. వారం రోజుల్లో పెళ్లి కావల్సి కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరు అయింది.

సోమవారం(ఏప్రిల్ 22) కర్నూలు జిల్లా పాములపాడు మండలం కంబాలపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేంద్ర మృతి చెందాడు. తన పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి వస్తూ.. ప్రమాదవశాత్తు బస్సును ఓవర్టేక్ చేయడం పోయి, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాద సంఘటన జరిగిన ఐదు నిమిషాలలోపే వెనకాల ఆటోలో తల్లి వ్యాపార నిమిత్తం వెళ్లి వస్తూ, ఆ రోడ్డు సైడ్ కొడుకు పడి ఉండడాన్ని గమనించింది. అయ్యో.. ఆటో ఆపండి.. అక్కడ నా కొడుకు లాగే ఉన్నాడంటూ ఆటో ఆపి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూడగా తన కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పెళ్లి పత్రికలు పంచి వస్తాను.. సాయంత్రం పెళ్లి బట్టలకు పోదామని, తిరిగి రాని లోకాలకు వెళ్లిన కొడుకు చూసి ఆ తల్లి రోదనలు అక్కడున్న వారందరినీ కన్నీరు పెట్టించింది.

ఆత్మకూరు పట్టణానికి చెందిన నాగసుబ్బమ్మ, కాంతారావు దంపతుల రెండవ కుమారుడైన నాగేంద్ర స్థానికంగా చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన యువతితో నాగేంద్రకు వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 30వ తేదీన ఆత్మకూరు పట్టణంలో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే పాములపాడు మండల కంబాలపల్లె గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్ళికొడుకు నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనం బైక్ డీ కొట్టడంతో, బైక్‌పై ప్రయాణం చేస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన నాగేంద్ర మృతి చెందాడు. మృతుడు నాగేంద్ర తన పెళ్లి పత్రికలను పంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో లబోదిపొమ్మంటున్నారు కుటుంబ సభ్యులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్