Washington: సాయి వర్షిత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు.. కోర్టులో విచారణ.. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు..

మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ జన్మతః అమెరికన్ సిటిజన్. సాయి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే విజయవాడ నుంచి అమెరికాకు వెళ్లారు. ఒక తమ్ముడు ఉన్నాడు. 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

Washington: సాయి వర్షిత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు.. కోర్టులో విచారణ.. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు..
Kandula Sai Varshith
Follow us
Surya Kala

|

Updated on: May 25, 2023 | 8:40 AM

అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్ హత్యకు యత్నించిన సాయివర్షిత్‌పై వాషింగ్టన్‌ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్‌కి వచ్చిన పేరెంట్స్‌ బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన తరపున వాదించడానికి అటార్నీని సాయి వర్షిత్ తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో కోర్టు సాయిని మానసిక నిపుణుల ఆధ్వర్యంలో ఉంచాలని సూచించింది. కేసు ని వచ్చే మంగళవారం కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సాయివర్షిత్‌కి బెయిల్‌ వస్తుందా..? అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదా..? అమెరికా కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోందనేది సర్వత్రా ఉత్కంఠం నెలకొంది.

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ దగ్గర ట్రక్కుతో దాడికి యత్నించిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతన్ని అన్ని కోణాల్లో విచారించారు. ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ను హత్య చేయాలనే లక్ష్యంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు తెలిసింది. ఇందుకోసం అతను 6 నెలలుగా ప్లాన్‌ చేసి మరీ ఘటనకు పాల్పడినట్లు తేలింది. ఈ విషయాన్ని సాయి వర్షిత్‌ విచారణలో అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాయి వర్షిత్‌ సోమవారం రాత్రి సెయింట్‌ లూయిస్‌ నుంచి వాషింగ్టన్‌లోని డ్యుల్లెస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఆ తర్వాత యు-హాల్‌ సంస్థ నుంచి ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్‌ బయట ఉన్న సైడ్‌వాక్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ భద్రతకోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి ఢీకొట్టడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వైట్‌హౌస్‌లోకి వెళ్లి బైడెన్‌ లేదా అక్కడున్నవారిలో ఎవరినైనా గాయపర్చి లేదా చంపేసి అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఆన్‌లైన్లో కొనుగోలు చేసిన నాజీ జెండాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ జన్మతః అమెరికన్ సిటిజన్. సాయి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే విజయవాడ నుంచి అమెరికాకు వెళ్లారు. ఒక తమ్ముడు ఉన్నాడు. 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్‌, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టున్న అతను.. డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డిన్‌ ప్రొఫైల్‌ ద్వారా తెలిసింది. ఐతే నిందితుడిపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్‌ రికార్డ్‌ లేదని పోలీసులు వెల్లడించారు. సాయి వర్షిత్‌ మానసిక పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేశారు. అతని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించారు. అయితే సాయివర్షిత్‌ మానసిక స్థితి సరిగ్గా లేదని ధృవీకరించారు.

సాయివర్షిత్‌పై ప్రెసిడెంట్‌ హత్యకు కుట్ర చేయడం, కిడ్నాప్‌ లేదా దాడికి ప్రయత్నించడం, ఆయుధాలతో దాడికి ప్రయత్నించడం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంలాంటి కేసులు ఉన్నాయి. అయితే ఈ ఎటాక్‌ వెనుక కుట్రకోణం లేదని చెప్తూ, అతని తల్లిదండ్రులు వాషింగ్టన్‌ కోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అటు తానా టీమ్‌ కూడా సాయి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు, బెయిల్‌ విషయంలో ఏం జరుగుంతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు