AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in June: మీరు కూడా రూ. 2 వేల నోటును మార్చాలనుకుంటున్నారా.. జూన్ సెలవు జాబితా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోండి..

జూన్ నెలలో బ్యాంకులు ఏ రోజుల్లో సెలవుల్లో ఉండనున్నాయనే విషయం ముందుగా తెలుసుకోవాలి. సెలవులకు అనుగుణంగా కస్టమర్స్ బ్యాంకుకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో జూన్ నెలలో RBI వెబ్‌సైట్ బ్యాంక్ సెలవులను ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం  జూన్ నెలలో ఆది, శనివారాలు సహా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

Bank Holidays in June: మీరు కూడా రూ. 2 వేల నోటును మార్చాలనుకుంటున్నారా.. జూన్ సెలవు జాబితా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోండి..
Bank Holidays
Surya Kala
|

Updated on: May 25, 2023 | 7:37 AM

Share

ఆర్‌బీఐ ఆదేశాల తర్వాత మే 23 నుంచి దేశవ్యాప్తంగా రెండు వేల నోట్ల రద్దు పర్వం మొదలైంది. ఈ పెద్ద నోట్లను మార్చుకోవడానికి సామాన్యులకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. మే నెల నాలుగు రోజుల్లో ముగియనుంది. జూన్ ప్రారంభం కానుంది. మే నెలలో మాత్రమే కాదు.. జూన్ నెలలో కూడా రూ. 2000 రూపాయల నోట్లను మార్చుకోవాలని భావిస్తున్నారా.. అయితే జూన్ నెలలో బ్యాంకులు ఏ రోజుల్లో సెలవుల్లో ఉండనున్నాయనే విషయం ముందుగా తెలుసుకోవాలి. సెలవులకు అనుగుణంగా కస్టమర్స్ బ్యాంకుకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో జూన్ నెలలో RBI వెబ్‌సైట్ బ్యాంక్ సెలవులను ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం  జూన్ నెలలో ఆది, శనివారాలు సహా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రాష్ట్రంలోని వివిధ పండుగలు ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

జూన్ సెలవుల జాబితా:

జూన్ 4వ తేదీ ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జూన్ 10వ తేదీ రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

జూన్ 11 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూన్ 15  యంగ్ మిజో అసోసియేషన్ డే (YMA Day) , రాజా సంక్రాంతి జూన్ 15 న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో  ఐజ్వాల్ , భువనేశ్వర్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూన్ 18 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూన్ 20న కాంగ్, పూరి జగన్నాథుడి రథయాత్ర ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా భువనేశ్వర్, ఇంఫాల్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూన్ 24న నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

జూన్ 25వ తేదీ ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూన్ 26న అగర్తలాలో సెలవులు వచ్చే అవకాశం ఉంది.

జూన్ 28, 29 తేదీలలో దేశవ్యాప్తంగా బక్రీద్ జరుపుకుంటారు. రెండు రోజులలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో  బ్యాంకులకు సెలవులు ఇస్తారు.

జూన్ 30న రెమ్నా నే సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుదినంగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..