AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: ప్రపంచం చూపు మన చంద్రయాన్ వైపు.. దక్షిణాఫిక్రాలో మధుర క్షణాలను తిలకించనున్న ప్రధాని మోడీ..

PM Modi to join Chandrayaan landing programme: ఆకాశంలో అద్భత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. చుక్కల్లో చంద్రుడిని ఒడిసిపట్టుకునే అత్యంత అరుదైన ఘటన ఈరోజు చోటుచేసుకోబోతోంది. చంద్రయాన్‌ 3 ప్రయోగంలో.. ఆర్బిట్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి.. జాబిల్లిపై దిగబోతోంది. గతంలా కాకుండా.. ఈసారి కచ్చితంగా సక్సెస్‌ అవుతామని ఇస్రో చెబుతోంటే.. ఎలాంటి ఆటంకాలు కలుగకూడదని దేశవ్యాప్తంగా సర్వమత ప్రార్ధనలు జరుగుతున్నాయి.

Chandrayaan-3: ప్రపంచం చూపు మన చంద్రయాన్ వైపు.. దక్షిణాఫిక్రాలో మధుర క్షణాలను తిలకించనున్న ప్రధాని మోడీ..
PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2023 | 9:35 AM

Share

PM Modi to join Chandrayaan landing programme: ఆకాశంలో అద్భత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. చుక్కల్లో చంద్రుడిని ఒడిసిపట్టుకునే అత్యంత అరుదైన ఘటన ఈరోజు చోటుచేసుకోబోతోంది. చంద్రయాన్‌ 3 ప్రయోగంలో.. ఆర్బిట్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి.. జాబిల్లిపై దిగబోతోంది. గతంలా కాకుండా.. ఈసారి కచ్చితంగా సక్సెస్‌ అవుతామని ఇస్రో చెబుతోంటే.. ఎలాంటి ఆటంకాలు కలుగకూడదని దేశవ్యాప్తంగా సర్వమత ప్రార్ధనలు జరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది.. చంద్రయాన్‌-3 ప్రయోగంలో అత్యంత కీలక దశ.. చంద్రుడిపై పరిశోధనలకు రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. జాబిల్లికి కూతవేటు దూరంలోనే ఉన్న చంద్రయాన్‌ విక్రం ల్యాండర్‌.. మరికొద్ది గంటల్లో చంద్రుడిపై ల్యాండ్‌ కాబోతోంది. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండింగ్‌ మాడ్యూల్‌ ఇప్పటికే చంద్రుడికి మరింత చేరువైంది. అయితే.. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యే క్రమంలో చివరి 15 నిమిషాలు అత్యంత కీలకమంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ప్రస్తుతం ల్యాండింగ్‌ మాడ్యూల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ.. నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. బుధవారం సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం.. సాయంత్రం 6.04గంటలకు చంద్రయాన్‌-3 జాబిల్లిపై దిగుతుంది. దీన్ని సురక్షితంగా దించేందుకు భారత శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని.. చంద్రయాన్‌-3 ప్రయాణం సాఫీగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రయాన్‌-3 విజయవంతమైతే భారత్‌ కొత్త రికార్డు సృష్టించనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ నిలవనుంది.

వర్చువల్ గా వీక్షించనున్న ప్రధాని మోడీ..

గతంలో ఏ దేశమూ కాలుమోపని చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్‌ దిగే అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిని ఇస్రో సాయంత్రం 5.20 నుంచి లైవ్ టెలికాస్ట్ చేయనుంది. దీనిని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాగా.. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ సౌతాఫ్రికాలో రెండో రోజు పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ బిజీగా ఉన్నప్పటికీ.. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించనున్నారు. ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా ఈ మధుర క్షణాలను తిలకిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..