AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. కట్ చేస్తే షాకిచ్చిన వధువు.. రణరంగంగా మారిన మండపం..

ఇష్టంలేని పెళ్లి.. జీవితాంతం నరకమే.. ఒక్కసారి తాళి మెళ్లో పడిందా చచ్చినట్టు భరించాల్సిందే..! పరువు.. ప్రతిష్ట.. కట్టుబాట్లు.. ఆచారాలు అంటూ పెద్దలు చెప్పే మాటలకు తలొంచితే లైఫంతా జైల్లో ఖైదీలాగే మారిపోతుంది. ఇలాంటి ఫ్యూచర్‌ కళ్లముందు కనిపించేసరికి ఓ అమ్మాయి పీటలపై ప్రతిఘటించింది. తాళి కట్టేవేళ ఈ పెళ్లి వద్దు.. వద్దు.. వద్దు అంటూ కన్నీరుపెట్టి మరీ వేడుకుంది. కానీ..

Wedding: తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. కట్ చేస్తే షాకిచ్చిన వధువు.. రణరంగంగా మారిన మండపం..
Marriage
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2023 | 9:56 AM

Share

Bride stopped marriage: ఇష్టంలేని పెళ్లి.. జీవితాంతం నరకమే.. ఒక్కసారి తాళి మెళ్లో పడిందా చచ్చినట్టు భరించాల్సిందే..! పరువు.. ప్రతిష్ట.. కట్టుబాట్లు.. ఆచారాలు అంటూ పెద్దలు చెప్పే మాటలకు తలొంచితే లైఫంతా జైల్లో ఖైదీలాగే మారిపోతుంది. ఇలాంటి ఫ్యూచర్‌ కళ్లముందు కనిపించేసరికి ఓ అమ్మాయి పీటలపై ప్రతిఘటించింది. తాళి కట్టేవేళ ఈ పెళ్లి వద్దు.. వద్దు.. వద్దు అంటూ కన్నీరుపెట్టి మరీ వేడుకుంది. కానీ.. పెళ్లి కొడుకు సహా బంధువులు ఎవరూ ఆమె మాట వినలేదు.. అందరూ కలిసి బలవంతంగా తాళి కట్టించబోయారు. కానీ, చివరకు వధువు పెళ్లిని అడ్డుకుంది.. తాళిని గుంజుకుని హుండీలో వేసే ప్రయత్నం చేసింది. చివరకు పీటలమీదే వాగ్వాదం.. బయట బంధువుల రణరంగం.. చివరికెలాగో పెళ్లైతే ఆగింది. గుడిలో మంటపానికి వచ్చినప్పుడు మౌనంగా ఉన్నా అమ్మాయి.. తాళి కట్టే క్షణం దగ్గర పడుతుంటే భయంతో వణికిపోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది చూస్తూ కూడా ఎవరూ ఆమె ఎందుకు పెళ్లి వద్దంటోందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ముహూర్తానికి తాళి కట్టించేయలనే తొందరే తప్ప.. కనీసం ఆమెను ఓదారుద్దాం.. ఏం జరిగిందో తెలుసుకుందా అని ట్రై చేయలేదు. తల్లిదండ్రులు సహా అంతా ఏదో రకంగా తాళి కట్టించేలానే చూడడంతో విధిలేని పరిస్థితుల్లో అమ్మాయి ప్రతిఘటించి తాళిమెడలో పడకుండా అడ్డుకుంది.

ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం తిరువాడనైలో చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లా తిరువాడానై వద్ద ఉన్న ఓ గ్రామానికి చెందిన యువకుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం సొంతూరుకు రాగా.. పక్క గ్రామానికి చెందిన 22ఏళ్ల యువతితో వివాహం నిశ్చయించారు. సోమవారం ఉదయం తిరువాడానైలో ఉన్న ఓ ఆలయంలో వివాహం చేయాలని నిర్ణయించారు. చివరకు వరుడు మెడలో తాళికట్టబోతున్న సమయంలో వధువు తాళిని లాక్కొని తనకి పెళ్లి ఇష్టంలేదని తెలిపి, అక్కడున్న హుండీలో తాళిని వేయడానికి యత్నించింది. బంధువులు సమాధానపరచడానికి యత్నించినా ఆమె వినలేదు. దీంతో చివరకు పెళ్లి ఆగింది..

అయితే, బలవంతపు పెళ్లి వద్దన్న అమ్మాయి వయసు 22 ఏళ్లు. అబ్బాయి వయసు 28 ఏళ్లు.. అమ్మాయి ఆఖరు నిమిషంలో పెళ్లి వద్దనే సరికి వరుడు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పెళ్లికూతురు కుటుంబసభ్యులపై దాడి చేశారు. అలాగే తమకు అవమానం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పెళ్లి 4 నెలల కిందేట ఫిక్సయ్యింది. అయితే, అమ్మాయి తనకు పెళ్లి ఇష్టం లేదనే విషయాన్ని ముందే చెప్పిందో లేదో క్లారిటీ లేదు కానీ.. పీటల వరకూ వచ్చాక తాళి వద్దనే సరికి.. అబ్బాయి వాళ్లు రెచ్చిపోయారు. ఇరువర్గాల మధ్య తిట్లు, దాడులతో ఒక్కసారి ఉద్రిక్తత తలెత్తింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారించగా.. ఆమె తల్లిదండ్రుల బలవంతం కారణంగా పెళ్లికి అంగీకరించానని.. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే