Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancelled Trains List: మీరు ప్రయాణించాలనుకుంటున్న రైళ్లన్నీ దాదాపుగా రద్దే! కారణం ఏంటంటే..

ఇటీవల కాలంలో విశాఖ కేంద్రంగా నడిచే పలు రైళ్లు పెద్ద సంఖ్యలో రద్దు అవుతున్నాయ్.. దీంతో రైల్వే ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయవాడ డివిజన్ తో పాటు వాల్తేర్ డివిజన్ లో నిరంతరం ఈ రద్దు ప్రకటన సాధారణ అంశంగా మారిపోయింది. రైళ్లలో ప్రయాణం అంటే ఆ రైలు ఎక్కి గమ్యం చేరేదాకా గ్యారెంటీ లేకుండా పోయిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ట్రాక్ పునరుద్దరణ పనులు కావచ్చు, డబ్లింగ్ పనులు కావచ్చు, సిగ్నలింగ్ అభివృద్ది చేసే పనులు కావచ్చు దాదాపు ఆరు నెలలుగా విస్తృతంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రతీ..

Cancelled Trains List: మీరు ప్రయాణించాలనుకుంటున్న రైళ్లన్నీ దాదాపుగా రద్దే! కారణం ఏంటంటే..
SCR Cancelled several trains
Follow us
Eswar Chennupalli

| Edited By: Srilakshmi C

Updated on: Aug 23, 2023 | 8:25 AM

ఆదిలాబాద్, ఆగస్టు 23: ఇటీవల కాలంలో విశాఖ కేంద్రంగా నడిచే పలు రైళ్లు పెద్ద సంఖ్యలో రద్దు అవుతున్నాయ్.. దీంతో రైల్వే ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయవాడ డివిజన్ తో పాటు వాల్తేర్ డివిజన్ లో నిరంతరం ఈ రద్దు ప్రకటన సాధారణ అంశంగా మారిపోయింది. రైళ్లలో ప్రయాణం అంటే ఆ రైలు ఎక్కి గమ్యం చేరేదాకా గ్యారెంటీ లేకుండా పోయిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ట్రాక్ పునరుద్దరణ పనులు కావచ్చు, డబ్లింగ్ పనులు కావచ్చు, సిగ్నలింగ్ అభివృద్ది చేసే పనులు కావచ్చు దాదాపు ఆరు నెలలుగా విస్తృతంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రతీ రైలూ కనీసం నాలుగు గంటల నుంచి 10 గంటల వరకు ఆలస్యంగా నడుస్తూ ఉండడం తో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు

ఆగస్టు 24, 25 తేదీల్లో పలు రైళ్ల రద్దు

తాజాగా తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో 24,25 తేదీల్లో పలు రైళ్ల రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ ప్రకటించింది. అలమండ-కోరుకొండ-విజయనగరం సెక్షన్లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

రద్దైన రైళ్ల వివరాలు ఇవే

  • విశాఖ-కొరాపుట్-విశాఖ (08546- 08545)
  • విశాఖ-రాయపూర్-విశాఖ (08528-08527)
  • విశాఖ-పలాస-విశాఖ (08532-08531)
  • విజయనగరం- విశాఖ-విజయనగరం (07469-07468)
  • విశాఖ-పలాస- విశాఖ (07470-07471)
  • విశాఖ-రాయగడ-విశాఖ (08504-08503) పాసింజర్ ప్రత్యేక రైళ్లను ఆయా రోజుల్లో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆగస్టు 31 వరకు పలు రైళ్ల రద్దు

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్లో విజయవాడ- గుణదల స్టేషన్ల మధ్య 3వ లైన్ కు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి టీవీ9 కి తెలిపారు. నేటి నుంచి నుంచి ఆగస్టు 29 వరకు గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్ప్రెస్ తో పాటు సికింద్రాబాద్-విశాఖ (12740) గరీబ్ రథ్ తో పాటు, గుంటూరు- రాయగడ (17243), విశాఖ-కడప (17488) తిరుమల, విజయవాడ- విశాఖ (12718), విశాఖ- విజయవాడ(12717) రత్నాచల్, విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి, విశాఖ-మహబూబ్ నగర్ (12861) రైళ్లను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

అదే విధంగా నేటి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు విశాఖ-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్ ప్రెస్ తో పాటు విశాఖ-సికింద్రాబాద్(12739) గరీబ్ రధ్, రాయగడ- గుంటూరు(17244), కడప-విశాఖ (17487) తిరుమల ఎక్స్ప్రెస్, లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్, మహబూబ్నగర్-విశాఖ (12862) రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు త్రిపాఠి టీవీ9 కి వివరించారు.

ఇక ఈ నెల 26, 29 తేదీల్లో విశాఖ-నాందేడ్ (20811), 27 తేదీల్లో నాందేడ్-విశాఖ (20812), 25, 27, 28 దినాల్లో సంబల్పూర్-నాందేడ్ (20809), 26, 28, 29 రోజుల్లో నాందేడ్-సంబల్పూర్ (20810) నాగావళి ఎక్స్ప్రెస్, 25, 26, 28,29 న విశాఖ-విజయవాడ (22701), విజయవాడ-విశాఖ (22702) ఉదయ్ఎక్స్ప్రెస్, 26, 28, 31 తేదీల్లో విశాఖ- తిరుపతి(22707), 25, 27, 30 తేదీల్లో తిరుపతి- విశాఖ (22708) డబుల్ డెక్కర్, 25న విశాఖ-చెన్నై సెంట్రల్ (22801), 26న చైన్నై సెంట్రల్ – విశాఖ (22802), 26న సికింద్రాబాద్-విశాఖ (12784), 27న విశాఖ- సికింద్రాబాద్ (12783) ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు త్రిపాఠీ టీవీ9 కి వివరించారు

అదేవిధంగా ఆగస్టు 26వ తేదీన భువనేశ్వర్- తిరుపతి(02809), 27న తిరుపతి- భువనేశ్వర్ (02810) ఏసీ స్పెషల్, 28న విశాఖ- తిరుపతి (08583), 29న తిరుపతి-విశాఖ (08584), 22న హైదరాబాద్- కటక్ (07165), 23న కటక్- హైదరాబాద్ (07166) రైళ్లు రద్దుకానున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.