Andhra Pradesh: ఆ దేవుడికి గులక రాళ్ళే నైవేద్యం.. అలా చేస్తేనే కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం..

ఆదిపరాశక్తి.. హిందువులు ప్రధానంగా పూజించే దేవుళ్లు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇక గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆయా ప్రాంతాల ప్రజలు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, అంకాలమ్మ, వివిధ రకాల పేర్లలో గ్రామీణ దేవతలను కొలుస్తారు భక్తులు. తమ శక్తి మేరకు ఉత్సవాలు నిర్వహించి, దేవతా మూర్తులకు నైవేద్యం, ప్రసాదాలు అర్పిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంప్రదాయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి.

Andhra Pradesh: ఆ దేవుడికి గులక రాళ్ళే నైవేద్యం.. అలా చేస్తేనే కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం..
Andhra Pradesh Temple
Follow us
Nalluri Naresh

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 22, 2023 | 10:34 PM

శివుడు, విష్ణువు, బ్రహ్మ దేవుడి.. ఆదిపరాశక్తి.. హిందువులు ప్రధానంగా పూజించే దేవుళ్లు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇక గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆయా ప్రాంతాల ప్రజలు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, అంకాలమ్మ, వివిధ రకాల పేర్లలో గ్రామీణ దేవతలను కొలుస్తారు భక్తులు. తమ శక్తి మేరకు ఉత్సవాలు నిర్వహించి, దేవతా మూర్తులకు నైవేద్యం, ప్రసాదాలు అర్పిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంప్రదాయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. అయితే, ఇప్పటికే ప్రపంచానికి తెలియని ఆసక్తికరమైన ఆచారాలు, సంప్రదాయాలు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. అలాంటి దేవుడి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బట్ల బైరవేశ్వర స్వామి ఈ పేరు చెప్తే చాలు ఆ ప్రాంతంలో ఆ దేవుడిపై ఎంతో నమ్మకం.. గుడి లేదు.. బండరాయికి గులకరాళ్ళతో పూజ చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని అక్కడి ప్రజల విశ్వాసం. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొత్తపల్లి గ్రామ పొలిమేరలో బట్ల బైరవేశ్వర స్వామి అంటే స్థానికులకు కోరిన కోర్కెలు తీర్చి.. కొంగు బంగారమయ్యే దేవుడు.. ఆ దారిలో వెళ్లే వారు ఏదైనా కోర్కెతో ఐదు నుంచి తొమ్మిది గులకరాళ్లు నైవేద్యంగా పెట్టి.. మొక్కుకుంటే వారి కోరికలు తీరుతాయని ఎంతో విశ్వాసంగా నమ్ముతారు అక్కడి ప్రజలు. శుభకార్యానికి వెళ్ళేటప్పుడైనా.. ఏదైనా పని మీద వెళుతున్నా.. స్వామికి గులక రాళ్ళు నైవేధ్యంగా పెడితే.. అనుకున్న పనులు.. కోర్కెలు తీరతాయని అనాదిగా వస్తున్న ఆచారం.

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం రోజున భట్ల భైరవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామి వారికి ప్రసాదంతోపాటు గులకరాళ్లు నైవేద్యంగా పెట్టడం ఇక్కడి భక్తుల ఆనవాయితీ. లేపాక్షి మండల పరిధిలోని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ బట్ల బైరేశ్వర స్వామి పట్ల ఎంతో భక్తి విశ్వాసం ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని.. ఆనవాయితీని ఇప్పటికీ పాటిస్తున్నారు స్థానికంగా ఉన్న ప్రజలు. గులక రాళ్ళే స్వామికి గుగ్గీళ్ళు అంటారు భక్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..