Andhra Pradesh: గన్నవరంలో నారా లోకేష్ పాదయాత్ర.. యువగళం రూట్‌లో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం..

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. విజయవాడలోని మూడు నియజకవర్గాల్లో యువగళం యాత్ర పూర్తైంది. గన్నవరంలో లోకేష్ యాత్ర సాగుతోంది. బుధవారం మద్యాహ్నం గన్నవరం సమీపంలోని చిన అవుటపల్లి నుంచి పాదయాత్ర షెడ్యూల్ ఉంది. చిన అవుటపల్లి, వీరవల్లి, రంగన్నగూడెం, సింగన్నగూడెం మీదుగా మల్లవల్లి చేరుకుంటారు. ఇదే రూట్‌లో రంగన్న గూడెం దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వెలిసింది. యువగళమైనా, జనగళమైనా,

Andhra Pradesh: గన్నవరంలో నారా లోకేష్ పాదయాత్ర.. యువగళం రూట్‌లో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం..
NTR Flexi
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 22, 2023 | 9:55 PM

ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు మరోసారి కలకలం రేపాయి. గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర రూట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తెరపైకి వచ్చాయి. గతంలోనూ చాలాసార్లు ఇదే సీన్ రిపీటైంది. ఇప్పుడు యువగళం యాత్రలోనూ ఈ ఫ్లెక్సీలు కనిపించాయి.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. విజయవాడలోని మూడు నియజకవర్గాల్లో యువగళం యాత్ర పూర్తైంది. గన్నవరంలో లోకేష్ యాత్ర సాగుతోంది. బుధవారం మద్యాహ్నం గన్నవరం సమీపంలోని చిన అవుటపల్లి నుంచి పాదయాత్ర షెడ్యూల్ ఉంది. చిన అవుటపల్లి, వీరవల్లి, రంగన్నగూడెం, సింగన్నగూడెం మీదుగా మల్లవల్లి చేరుకుంటారు. ఇదే రూట్‌లో రంగన్న గూడెం దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వెలిసింది. యువగళమైనా, జనగళమైనా, ఏ గళమైనా తెలుగునాట స్మరించేది నందమూరి తారకరామారావు పేరు మాత్రమే అంటూ ఆ ఫ్లెక్సీ మీద రాసి ఉంది. ఎన్టీఆర్, హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి.

సాధారణంగా ఎవరైనా బ్యానర్ కడితే.. వాళ్ల పేర్లు గానీ, ఫోటోలు గానీ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ అవేమీ లేవు. దీంతో ఇవి ఎవరు కట్టారనే దానిపై క్లారకిటీ లేదు. అయితే ఆ గ్రామంలో టీడీపీ మద్ధతుదారులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వాళ్లలో ఎవరో ఒకరు కట్టి ఉంటారని చెప్తున్నారు స్థానికులు.

గతంలోనూ చంద్రబాబు, లోకేష్ యాత్రల్లో జూనియర్ ఫ్లెక్సీలు, జెండాలు కనపడ్డాయి. ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 16న అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో చంద్రబాబు పర్యటనలోనూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. బహిరంగ సభకు పెద్ద ఎత్తున్న వచ్చిన టీడీపీ శ్రేణుల్లో కొంత మంది ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఇప్పుడు లోకేష్ యాత్రలోనూ బ్యానర్లు తెరపైకి వచ్చాయి.

టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించిన ట్వీట్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!