AP News: జీడి తోటలో సరదాగా గడుపుదామని భర్తను తీసుకెళ్లింది.. ఆ తర్వాత
తాండవ రహదారి వైపు వెళ్లి సరదాగా గడుపుదామని చెప్పుకొచ్చింది భార్య. భార్య మాటల వెనుక మర్మాన్ని గుర్తించని ఆ భర్త సరే అని ఆమెను తీసుకెళ్లాడు. బైక్ పై ఇద్దరూ బయలు దేరారు. వెనుక కొంత దూరంలో జానకి ప్రియుడి రాము వీరిని అనుసరిస్తున్నాడు. జానకీ, చింతల రాము ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తాండవ నది గట్టు దాటిన తర్వాత కొంత దూరం వెళ్లాక జానకి తన భర్తతో బహిర్భూమికి వెళ్ళాలి.. బండి ఆపమని చెప్పి రోడ్డు పక్కన గల జీడి తోటలోకి వెళ్లింది జానకి. కొద్దిసేపటికి.. తోటల్లో కాసేపు సరదాగా గడుపుదామని ప్రేమతో భార్య చెప్పేసరికి ఆ భర్త సరేనన్నాడు. ఇద్దరూ తోటలో కూర్చున్నారు.. భర్త తల తీసి తన ఒడిలో పెట్టుకునేసరికి..
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 23: వాళ్ళిద్దరూ భార్యాభర్తలు..! ఆలయానికి తీసుకు వెళ్ళమని భర్తను కోరింది భార్య. తప్పకుండా అని చెప్పి ఆమెను అతడు తీసుకువెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఓ తోటలో ఆపి సరదాగా గడుపుదామని చెప్పింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని నిమిరింది. అబ్బో ఎంత ప్రేమో.. అనుకున్నాడు ఆ భర్త. ఆ ప్రేమ వెనుక ఉన్న కర్కోటత్వాన్ని ఆ భర్త గుర్తించలేకపోయాడు. ఒడిలో తలపెట్టిన క్షణాల్లోనే.. హత్యకు గురయ్యాడు . ఆ తర్వాత భర్త హత్యను ఆమె రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ప్రియుడి మోజులో భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆ భార్య వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని ఇద్దరు జబ్బలు చర్చుకున్నారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.. ఆ మర్డర్ స్కెచ్ వెలుగులోకి వచ్చి నిందితులు కటకటాల వెనక్కు వెళ్లారు. అనకాపల్లి జిల్లాలో పార్టీలకే కంగు తినిపించిన ఆ మహిళ వేసిన మర్డర్ స్కెచ్ ఇది..!
వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసింది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన వివాహిత.. తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి, సుత్తి, రాళ్లతో కొట్టి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు ప్రయత్నించి, పోలీసులకు దొరికిపోయింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం మల్లంపేటకు చెందిన గుడివాడ అప్పలనాయుడు, జానకి భార్యభర్తలు. పాత కేడీపేటకు చెందిన చింతల రాముతో గత కొన్నాళ్లుగా జానకి చనువుగా ఉంటుంది. వివాహేతర సంబందం నడుపుతోంది. అనుమానం వచ్చిన భర్త.. మందలించాడు. ఆ తర్వాత భర్తతో జానకి సఖ్యతగా ఉన్నట్లు నమ్మించింది. పతే తన జీవితం అనేలా బిల్డప్ ఇచ్చింది.
భక్తితో గుడికి వెళదామని తీసుకెళ్లి..
భర్తతో ఉంటూనే ప్రియుడితో తన వ్యవహారాలను కొనసాగిస్తోంది జానకి. అయితే.. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన జానకి.. భర్త అప్పలనాయుడును అంతమొందించాలని నిర్ణయించుకుంది. లవర్ రాముతో కలిసి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 20 న కోటవురట్ల మండలం పాములవాక గ్రామంలో పట్టాలమ్మ తల్లి గుడికి వెళ్లాలని భర్తకు చెప్పింది జానకి. భార్య అన్యోన్యంగా చెప్పడంతో సరే అని ఆలయానికి గుడికి తీసుకెళ్లాడు భర్త అప్పలనాయుడు. గుడిలో పూజ చేశాక తిరుగు ప్రయాణమయ్యారు.
ఆ తోటలోనే అసలు స్కెచ్..
తాండవ రహదారి వైపు వెళ్లి సరదాగా గడుపుదామని చెప్పుకొచ్చింది భార్య. భార్య మాటల వెనుక మర్మాన్ని గుర్తించని ఆ భర్త సరే అని ఆమెను తీసుకెళ్లాడు. బైక్ పై ఇద్దరూ బయలు దేరారు. వెనుక కొంత దూరంలో జానకి ప్రియుడి రాము వీరిని అనుసరిస్తున్నాడు. జానకీ, చింతల రాము ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తాండవ నది గట్టు దాటిన తర్వాత కొంత దూరం వెళ్లాక జానకి తన భర్తతో బహిర్భూమికి వెళ్ళాలి.. బండి ఆపమని చెప్పి రోడ్డు పక్కన గల జీడి తోటలోకి వెళ్లింది జానకి. కొద్దిసేపటికి.. తోటల్లో కాసేపు సరదాగా గడుపుదామని ప్రేమతో భార్య చెప్పేసరికి ఆ భర్త సరేనన్నాడు. ఇద్దరూ తోటలో కూర్చున్నారు.. భర్త తల తీసి తన ఒడిలో పెట్టుకునేసరికి.. తన భార్య తనపై ప్రేమ కురిపిస్తుందని అనుకున్నాడు ఆ భర్త అప్పలనాయుడు. కానీ క్షణాల్లోనే హత్యకు గురయ్యాడు. అప్పటికే అక్కడ మాట వేసిన జానకి ప్రియుడు రాము.. వెనుక నుంచి వచ్చి తలపై సుత్తితో బలంగా కొట్టాడు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తను రాయితో మోది జానకి చంపేసిందని తెలిపారు నర్సీపట్నం ఏఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా.
రోడ్డు ప్రమాదంగా సీన్ క్రియేట్..
ఆ తర్వాత మరో ప్లాన్ వేసింది భారీ జానకీ. భర్త అప్పలనాయుడు చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత.. తోటలోంచి డెడ్ బాడీని ఎవరూ లేని సమయంలో రోడ్డుపైకి తీసుకువచ్చారు. రోడ్డుపై మృతదేహాన్ని పెట్టి.. పక్కనే మోటారు సైకిల్ ను పడిపోయినట్టు సిన్ క్రియేట్ చేశారు. రోడ్డుపై రోదించడం ప్రారంభించింది జానకి. రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయడని అటుగా వచ్చి పోయే వారికి చెప్పి నమ్మించి ప్రయత్నం చేసింది. తొలుత అంతా నిజమే అనుకున్నారు. పోలీసులకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి శరీరంపై గాయాలు, ఆ తర్వాత వచ్చిన అనుమానంతో కూపి లాగేసరికి.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పలనాయుడును హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. జానకి ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఏ ఎస్ పి ఆదిరాజ్ సింగ్ రాణా.
– ఇదీ ప్రియుడు మోజు లో పడి భర్తను పక్కా స్కెచ్ తో హత్య చేసిన భార్య వ్యవహారం. మర్డర్ చేసి ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అడ్డంగా బుక్ అయింది జానకి, ఆమె ప్రియుడు రాము. జానకి ప్లాన్ చూసి కాకిలే అవాక్కయ్యారు. తెలిసిన వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..