AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy : ‘వేణు స్వామి మీ పవర్ ఏమైంది..?’ రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్

పూజలు, హోమాలు విషయంలో.. మాజీ ప్రధాని దేవె గౌడ కుటుంబం ముందు ఉంటుంది. వారికి పూజల సెంటిమెంట్ ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 19 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో.. ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ అగ్ర నేతలు.. కీలక దేవాలయాలు సందర్శించడంతో పాటు పలువురు దేవుళ్లు, జ్యోతిష్యులను సంప్రదించారు.

Venu Swamy : 'వేణు స్వామి మీ పవర్ ఏమైంది..?' రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
Venu Swamy
Ranjith Muppidi
| Edited By: Basha Shek|

Updated on: May 04, 2024 | 11:25 PM

Share

పూజలు, హోమాలు విషయంలో.. మాజీ ప్రధాని దేవె గౌడ కుటుంబం ముందు ఉంటుంది. వారికి పూజల సెంటిమెంట్ ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 19 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో.. ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ అగ్ర నేతలు.. కీలక దేవాలయాలు సందర్శించడంతో పాటు పలువురు దేవుళ్లు, జ్యోతిష్యులను సంప్రదించారు. ఆ సందర్భంగానే… దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్.డీ రేవన్న కుటుంబ సమేతంగా తెలంగాణలోని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని కలిసి ప్రత్యేక పూజలు చేశారు. వేణు స్వామి ఆధ్వర్యంలో రాజ్య శ్యామల, భగలాముఖి, తారా, చిన్న మస్తా వామాచార పూజలు చేశారు. వారి పూజలు, హోమాలు ఫలమో, లేక కాలమే కలిసొచ్చిందో తెలియదు కానీ.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా.. కేంద్రంలో బీజేపీతో జట్టు కట్టింది జేడీఎస్. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ వస్తే.. జేడీఎస్‌ కేంద్ర ప్రభుత్వంలో భాగం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రేవన్న, ఆయన కుమారుడు ప్రజ్వల్​రేవన్నపై తీవ్ర లైంగిక దాడి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఎంపీ ప్రజ్వల్.. హసన్​​ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. ఈ లైంగిక వేధింపుల ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటం, కోరిక తీర్చమని బలవంతం పెట్టడం, బెదిరింపులు, మహిళలపై దాడికి పాల్పడటం, అశ్లీల చిత్రాలను అప్‌లోడ్‌ చేయడం వంటి నేరాలకు సంబంధించి రేవణ్ణ, ప్రజ్వల్‌పై కేసులు నమోదయ్యాయి. వీళ్ల ఆకృత్యాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇదే కేసులో రేవన్న, ప్రజ్వల్‌లను సిట్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి వ్యవహారం కర్నాటకలో బీజేపీకి కూడా కంటగింపుగా మారింది. వారు జేడీఎస్‌తో ప్రయాణంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా వేణు స్వామి.. జాతక శాస్త్రాన్ని అవపోసన పట్టినట్లు కలరింగ్ ఇస్తూ ఉంటారు. తాను పూజలు చేస్తే.. జాతకాలు తారుమారు అవ్వాల్సిందే అంటూ యూట్యూబ్ చానల్స్‌లో ఊదరగొడుతూ ఉంటారు. ఇదే బిల్డప్‌తో పలు సిని సెలబ్రిటీలను, పొలిటీషన్లను కూడా అట్రాక్ట్ చేశారు. మరి పక్క రాష్ట్రం నుంచి వచ్చి.. ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న రేవన్న కుటుంబ జాతకాన్ని ఈయన మార్చలేకపోయారు. మరి వేణు స్వామి పవర్ తగ్గిందా..? లేక పూజల్లో ఏమైనా దోషం జరిగిందో వేణు స్వామే చెప్పాలి. ప్రభాస్ ఉచ్చ దశ ముగిసిందని ఇక హిట్స్ పడవని ఈయన మొన్నామధ్య చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ సలార్‌తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సమయంలో వేణు స్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి ఈయన హాట్ టాపిక్‌గా మారారు. రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామి నీ పవర్ ఏమైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…