బాబోయ్.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే షాక్ అవుతారు..
ఫిర్యాదు నేపథ్యంలో ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బస్తాలలో పిల్లులను రోడ్ల మీద నుండి తీసుకువెళుతున్నారు. విచారించగా, ఆ వ్యక్తి నగరంలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో పిల్లుల మాంసం విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
బయటకు వెళ్లి బిర్యానీ తినాలనుకుంటున్నారా? అయితే, మీరు మీ కోరికను అణచివేసుకోవాల్సిందే.. లేదంటే ప్రమాదంలో పడతారు. ఎందుకంటే.. మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టి హాయిగా లాగించిన తరువాత ఆ మాంసం పిల్లులది అని తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు..అలాంటి ఘటనే ఒకటి తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలో క్యాట్ మీట్ బిర్యానీ అమ్ముతున్నారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేననే వార్తలు అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఈసారి చెన్నైపెరంబూర్‌లో జరిగిన సంఘటన సంచలనంగా మారింది.
చెన్నై పెరంబూర్‌లోని నారికురవర్స్ పిల్లి మాంసంతో బిర్యానీ తయారు చేశారని ఆరోపించారు. ఫిర్యాదు నేపథ్యంలో ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బస్తాలలో పిల్లులను రోడ్ల మీద నుండి తీసుకువెళుతున్నారు.
చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని రెస్టారెంట్లలో నారికుర్వర్ అనే వ్యక్తుల బృందం పిల్లులను ఎత్తుకెళ్లి చంపి, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పిల్లులు తప్పిపోయిన సంఘటన 2018 లో ఈ ప్రాంతంలో జరిగింది. ఇది ఇటీవల సోషల్ మీడియాలో పిల్లి దొంగతనం వీడియో వైరల్ కావడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని పెరంబూర్‌లో నారికురవర్లు మాంసం కోసం నోరులేని పిల్లులను కిడ్నాప్ చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
Innocent cats are been catched for meat by narikuravars in Perambur chennai,These guys are habitual offendersShocking to see the footage Will @chennaipolice_ step in to stop any more innocent been killed @PetaIndia @PFAChennai_ @PTTVOnlineNews @polimernews pic.twitter.com/0AhadtxEon
— Mani (@Manimaestero03) April 30, 2024
ఇటీవల, చెన్నైలోని స్పర్ ట్యాంక్ రోడ్‌లో వీధి పిల్లులకు ఆహారం పెట్టే వ్యక్తి రాత్రి కిల్పాక్ చుట్టూ తిరుగుతూ పిల్లులకు ఆహారం ఇస్తూ పట్టుబడ్డాడు. విచారించగా, ఆ వ్యక్తి నగరంలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో పిల్లుల మాంసం విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..