AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..! ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..!

తల్లి ఎవరికైనా తల్లే అన్న మాట మారోమారు నిరూపితమవుతుంది. అది మనుషులైనా నోరులేని జంతువులైనా, చివరకు విష సర్పాలకైనా అమ్మతనం ఒకేలా ఉంటుంది. ఇందుకు నిదర్శనమే ఈ వైరల్‌ వీడియో. ఇంతకీ ఏం జరిగిందంటే...

Viral Video: కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..! ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..!
King Cobra Mother
Jyothi Gadda
|

Updated on: May 04, 2024 | 7:50 PM

Share

కింగ్ కోబ్రా..ఇది అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి. ఈ పాము కాటు కారణంగా భారతదేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. కోబ్రా బుసలు, కోపంగా విప్పే పడగ దాని ప్రత్యేక గుర్తింపు. ప్రస్తుతం ఒక ఆడ నాగుపాము తన గుడ్లను రక్షించుకోవడానికి ఎలాంటి సహాసం చేస్తుందో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తుంటే.. తల్లి ఎవరికైనా తల్లే అన్న మాట మారోమారు నిరూపితమవుతుంది. అది మనుషులైనా నోరులేని జంతువులైనా, చివరకు విష సర్పాలకైనా అమ్మతనం ఒకేలా ఉంటుంది. ఇందుకు నిదర్శనమే ఈ వైరల్‌ వీడియో. ఇంతకీ ఏం జరిగిందంటే…

పాముల రక్షణకు ప్రసిద్ధి చెందిన మురళీ వాలే హౌస్లా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియోను పంచుకున్నారు. ఓ ఇంట్లో పాము కోసం వెతకగా.. ఓ చోట గుడ్లతో పాము కనిపించడం వీడియోలో కనిపిస్తోంది. కదలిక రావడంతో పాము కోపంతో బుసలు కొడుతూ దాని గుడ్ల దగ్గర వచ్చి కూర్చుంటుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన గుడ్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన పాము గుడ్లను రక్షించడానికి సిద్ధంగా కూర్చుంది. ఎవరైనా దాని గుడ్ల దగ్గరికి వెళితే, అది కాటు వేసేందుకు కాచుకుని ఉంది.

ఈ వీడియో Instagram లో murliwalehausla24 అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఇది 20 లక్షల మందికి పైగా వీక్షించారు. 50 వేల మందికి పైగా లైక్ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కామెంట్లు కూడా చేశారు. ఒక తల్లి తన బిడ్డలను రక్షించుకోవడానికి ఎంతవరకు అయినా వెళ్లగలదని అది జంతువు, లేదా మనిషి ఏ రూపంలో ఉన్నా తల్లి అందరికీ తల్లే అని వ్యాఖ్యానించారు.

నాగుపాము ఎంత కోపంగా ఉంటుందో తెలిసి.. దాని దగ్గరకు వెళ్లడం ప్రమాదకరం అని మరొకరు రాశారు. ఈ పరిస్థితిలో పామును ఆటపట్టించడం అంటే మరణాన్ని ఆహ్వానించడమేనని ఇంకొకరు రాశారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఆ ఇంట్లో వారు ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఉంటున్నారు. వారితో పాటుగా ఆ డేంజర్ స్నేక్‌ కింగ్‌ కోబ్రాను కూడా కాపాడుతున్నారని ప్రశంసించారు.. ఏ తల్లి అయినా తన పిల్లల కోసం ఎంతటి శక్తితో అయినా పోరాడగలదని, ఈ పాము కూడా తన పిల్లలను కూడా కాపాడుతోందని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?
మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు