Bike stunt viral video: తిక్క కుదిరింది..! పోలీసుల ముందే రెచ్చిపోయిన బైకర్.. ! ఇలా అడ్డంగా బుక్కయ్యాడు..

ఈ వీడియోను పోలీసులు తమ అధికారికి X లో షేర్‌ చేశారు. దీనిలో బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియోను దాదాపు లక్ష మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. బైక్‌పై స్టంటింగ్‌పై పోలీసులు తీసుకున్న చర్యలపై కూడా ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేశారు.

Bike stunt viral video: తిక్క కుదిరింది..! పోలీసుల ముందే రెచ్చిపోయిన బైకర్.. ! ఇలా అడ్డంగా బుక్కయ్యాడు..
Bike Stunt
Follow us
Jyothi Gadda

|

Updated on: May 04, 2024 | 8:43 PM

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రజలు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు. రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. చాలా మంది వ్యక్తులు బైక్, కారులో రోడ్డుపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసులు చాలా మందిపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది తమ అలవాటును మానుకోవడం లేదు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న యువకుడి వీడియో వైరల్‌గా మారింది.

ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ డేంజర్ స్టంట్స్‌ చేస్తున్నాడు. బైక్‌ను స్పీడ్‌గా నడుపుతూ… రెండు చేతులను వదిలి డ్రైవ్‌ చేస్తున్నాడు. అయితే, అదే సమయంలో ఆ బైక్ రైడర్ వెనుక ఒక పోలీసు కారు కూడా నడుస్తోంది. అయితే, ఆ వ్యక్తికి పోలీసు వాహనం గురించి తెలుసా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, పోలీసులు మాత్రం అతనికి తగిన గుణపాఠం చెప్పారు. ప్రమాదకర స్టంట్‌ చేస్తూ..తనతో పాటుగా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేలా చేస్తున్న ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు ప్రశాంత్‌ యాదవ్‌ అని గుర్తించారు. బీహార్‌లోని సీతామర్హి జిల్లా నివాసి అని తెలిసింది. వీడియో వైరల్ కావడంతో చాలా మంది అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వీడియోను బీహార్ పోలీసులు అధికారికి X లో షేర్‌ చేశారు. దీనిలో బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియోను దాదాపు లక్ష మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. బైక్‌పై స్టంటింగ్‌పై పోలీసులు తీసుకున్న చర్యలపై కూడా ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ బైక్‌స్టంట్స్ చేస్తున్న వ్యక్తి చాలా కాలంగా వీడియోలు చేసేవాడని, అయితే ఇప్పుడు పోలీసులు తగిన శాస్తి చేశారని అంటున్నారు. అలాంటి వారి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి పోకిరీలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు రాశారు. ఇలాంటి విన్యాసాలు చేసేవారి లైసెన్సులు రద్దు చేయాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..