Viral News: 115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి భయానక చిత్రాలు..!
ఈ ఓడకు కంపెనీ యజమాని కుమార్తె పేరు పెట్టారు. ఈ 735 టన్నుల చెక్కతో తయారు చేయబడి ఆవిరి మీద నడిచే నౌక ఇది. ఈ నౌక బయలుదేరినప్పుడు అందులో 14 మంది ఉన్నారు. 195 అడుగుల పొడవున్న ఈ ఓడ అప్పట్లో 15 ఏళ్ల కాలంలో రెండుసార్లు మునిగిపోయింది. అప్పట్లో నావికులు ఈ నౌకను శాపగ్రస్తమైనదిగా పిలిచేవారు. ఎందుకంటే..
చరిత్రలో నీట మునిగి పోయిన చాలా ఓడలు గురించిన వాస్తవాలు, వార్తలు మనం వింటుంటాం. ఆ ఓడలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవటంతో భారీగా ప్రాణ ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. అయితే, అలాంటిదే ఒక ఓడను గురించి ప్రత్యేక విషయం ప్రచారంలో ఉంది. ఈ నౌక 115 సంవత్సరాల క్రితం మునిగిపోయింది. 115 సంవత్సరాల క్రితం సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఎక్కడికి వెళ్లిపోయిందో ఎవరికీ తెలియలేదు. అయితే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఆ నౌక ఆచూకీ తెలియడంతో షాకింగ్ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ నౌక అమెరికా సమీపంలో అదృశ్యమైంది. అయితే ఈ నౌకను శాపగ్రస్త ఓడ అని పిలుస్తారు.. దీనికి కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
నివేదిక ప్రకారం, అడెల్లా షోర్స్ అనే ఓడను 1894లో USAలోని మిచిగాన్‌లోని జిబ్రాల్టర్‌లో షోర్స్ లంబర్ అనే కంపెనీ నిర్మించింది. ఓడకు కంపెనీ యజమాని కుమార్తె పేరు పెట్టారు. ఈ 735 టన్నుల చెక్కతో తయారు చేయబడి ఆవిరి మీద నడిచే నౌక ఇది. ఈ నౌక బయలుదేరినప్పుడు అందులో 14 మంది ఉన్నారు. 195 అడుగుల పొడవున్న ఈ ఓడ అప్పట్లో 15 ఏళ్ల కాలంలో రెండుసార్లు మునిగిపోయింది. అప్పట్లో నావికులు ఈ నౌకను శాపగ్రస్తమైనదిగా పిలిచేవారు. ఎందుకంటే..
1909 ఏప్రిల్ 29 న, ఈ ఓడ మిన్నెసోటాకు బయలుదేరింది. ఆ సమయంలో అది ఉప్పుతో లోడ్ చేయబడుతోంది. కానీ, 1909 మే 1న ఆ ఓడ అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా పోయింది. ఈ నౌక మిచిగాన్‌లోని వైట్‌ఫిష్ పాయింట్ నుండి అదృశ్యమైంది. 2021లో 115 సంవత్సరాల తర్వాత సముద్రం నుండి 650 అడుగుల దిగువన ఓడ శిధిలాలు గుర్తించారు పరిశోధకులు. కనుగొనబడ్డాయి. 1894లో నిర్మించిన 15 ఏళ్లలో ఈ ఓడ రెండుసార్లు మునిగిపోయింది. ఇది చివరిగా కనిపించిన ప్రదేశానికి 64 కిలోమీటర్ల దూరంలో గుర్తించబడింది. గ్రేట్ లేక్స్ షిప్‌రెక్ హిస్టారికల్ సొసైటీ షిప్‌రెక్ ఓడను గుర్తించారు.
ఓడను ఎందుకు శాపగ్రస్తంగా పిలుస్తారు..
ఓడ నిర్మించబడిన సమయంలో కొత్త ఓడ పైన వైన్ బాటిల్‌ను పగలగొట్టే ఆచారం ఉంది. కానీ, షిప్ బిల్డింగ్ కంపెనీ యజమాని, అతని కుటుంబం మద్యం సేవించరు. కాబట్టి వారు మద్యం బాటిల్‌కు బదులుగా ఓడలోని వాటర్ బాటిల్‌ను పగలగొట్టారట. ఈ కారణంగానే ఓడ శపించబడిందని అప్పటి నుండి ప్రజలు నమ్ముతున్నారు. ఓడను నిర్మించిన కంపెనీ యజమాని కుమార్తె పేరు మీద ఓడ పేరు పెట్టారు.