క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు

క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు

Phani CH

|

Updated on: May 04, 2024 | 11:57 AM

క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్‌బాల్‌ లాటరీ గేమ్‌లో భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నాడు. ఏకంగా 1.3 బిలియన్‌ డాలర్లను గెలుచుకున్నాడు. లావోస్‌ దేశానికి చెందిన 46 ఏళ్ల చెంగ్ సైఫాన్ కొన్నాళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారు. పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తున్న ఆయన కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఎనిమిదేళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పవర్‌బాల్‌ లాటరీలో చెంగ్‌ టిక్కెట్లు కొన్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్‌బాల్‌ లాటరీ గేమ్‌లో భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నాడు. ఏకంగా 1.3 బిలియన్‌ డాలర్లను గెలుచుకున్నాడు. లావోస్‌ దేశానికి చెందిన 46 ఏళ్ల చెంగ్ సైఫాన్ కొన్నాళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారు. పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తున్న ఆయన కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఎనిమిదేళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పవర్‌బాల్‌ లాటరీలో చెంగ్‌ టిక్కెట్లు కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఈ డ్రాలో ఒక టికెట్‌.. మొత్తం ఐదు నెంబర్లతో సరిపోలిందని.. దీని విలువ 1.3 బిలియన్‌ డాలర్లు అని లాటరీ నిర్వాహకులు తెలిపారు. ఈ మొత్తం మన కరెన్సీలో 10 వేల 842 కోట్ల రూపాయలు. టాక్స్‌లో భాగంగా 422 మిలియన్ డాలర్లు తగ్గించి మిగిలిన మొత్తాన్ని అతడికి చెల్లిస్తారు. లాటరీలో ఈ భారీ మొత్తాన్ని గెలిచుకోవడంపై చెంగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. టికెట్లు కొనేందుకు సాయం చేసిన తన భార్య, స్నేహితుడితో ఈ డబ్బు పంచుకుంటాననీ మెరుగైన చికిత్సకు వినియోగిస్తానంటూ అన్నారు. పవర్‌బాల్‌ చరిత్రలో ఇది నాల్గవ అతి పెద్ద లాటరీ కావడం విశేషం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??

బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. కానీ అతని షర్ట్‌లోనే ఉంది అసలు ట్విస్ట్‌

NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్

Aamir Khan: చిరాకు వేయడంతో.. నగ్నంగా పరిగెత్తా..

Baahubali: బాహుబలి సిరీస్‌ వస్తోంది.. జక్కన్న అనౌన్స్ మెంట్