కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్ సంగతి ఏంటి ??
విశ్వంలో కృష్ణ బిలాలుగా చెప్పుకునే భారీ బ్లాక్ హోల్స్ గురించి విన్నాం. మరి మీరెప్పుడైనా భూమ్మీద ఉన్న లోతైన బ్లూ హోల్ గురించి విన్నారా? సైంటిస్టులు తాజాగా ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన బ్లూ హోల్ ను గుర్తించారు. దీని లోతు సముద్రమట్టానికి దిగువన 1,380 అడుగులు . అంటే షికాగోలోని ప్రఖ్యాత ట్రంప్ టవర్ కూడా ఇందులో మునిగిపోయేంత లోతు అన్నమాట! ఇది మెక్సికోలోని చెటుమాల్ బే ప్రాంతంలో ఉంది.
విశ్వంలో కృష్ణ బిలాలుగా చెప్పుకునే భారీ బ్లాక్ హోల్స్ గురించి విన్నాం. మరి మీరెప్పుడైనా భూమ్మీద ఉన్న లోతైన బ్లూ హోల్ గురించి విన్నారా? సైంటిస్టులు తాజాగా ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన బ్లూ హోల్ ను గుర్తించారు. దీని లోతు సముద్రమట్టానికి దిగువన 1,380 అడుగులు . అంటే షికాగోలోని ప్రఖ్యాత ట్రంప్ టవర్ కూడా ఇందులో మునిగిపోయేంత లోతు అన్నమాట! ఇది మెక్సికోలోని చెటుమాల్ బే ప్రాంతంలో ఉంది. దీని పేరు టాం జా బ్లూ హోల్. దీని లోతును శాస్ర్తవేత్తలు ఇటీవలే కొలిచారు. ఇప్పటివరకు అత్యంత లోతైన బ్లూ హోల్ గా రికార్డుకెక్కిన దక్షిణ చైనా సముద్రంలోని శాన్షా యోంగల్ బ్లూ హోల్ కన్నా టాం జా బ్లూ హోల్ 480 అడుగుల లోతు ఎక్కువ. ఇందుకు సంబంధించిన అధ్యయనం వివరాలను ‘ఫ్రాంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్’ ప్రచురించింది. ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొనని జీవజాలం ఇందులో జీవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రవహించిన హిమనీనదాలు కొన్ని ప్రదేశాల్లో లోపలకు కుచించుకుపోవడం వల్ల బ్లూ హోల్స్ ఏర్పడతాయి. అంటే ఇవి మహాసముద్రాల్లో దాగిన నిట్టనిలువు గుహల్లాంటివి. సింక్ హోల్స్ లాగా గుండ్రంగా ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్ మెట్రో ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్.. కానీ అతని షర్ట్‌లోనే ఉంది అసలు ట్విస్ట్
NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్