మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..? కోరి సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..! ఎందుకంటే..

వేసవిలో మామిడిని చాలా రకాలుగా వినియోగిస్తారు. కొంతమంది పండిన మామిడి పండ్లను తీసుకుంటే, చాలా మంది మామిడి పన్నా, మామిడి షేక్ కూడా తీసుకుంటారు. అయితే, మామిడి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగడం, సోడాలు వంటివి తాగడం మంచిది కాదని అంటుంటారు. మామిడి పండ్లు తిని మంచి నీటిని తాగితే, కోరి సమస్యల్లో పడినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..? కోరి సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..! ఎందుకంటే..
Follow us
Jyothi Gadda

|

Updated on: May 04, 2024 | 10:56 AM

వేసవి కాలం మండే వేడితో పాటు మామిడికి కూడా ప్రసిద్ధి చెందింది. మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. ఈ వేసవి కాలంలో ఎక్కడ చూసినా మామిడి పండ్లు విరివిగా కనిపిస్తుంటాయి. ఈ సీజన్‌లో మామిడి పండు తినని వారు ఉండరు. మామిడి పండ్లను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. మామిడి పండ్లలో అనేక పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. వేసవిలో మామిడిని చాలా రకాలుగా వినియోగిస్తారు. కొంతమంది పండిన మామిడి పండ్లను తీసుకుంటే, చాలా మంది మామిడి పన్నా, మామిడి షేక్ కూడా తీసుకుంటారు. అయితే, మామిడి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగడం, సోడాలు వంటివి తాగడం మంచిది కాదని అంటుంటారు. మామిడి పండ్లు తిని మంచి నీటిని తాగితే, కోరి సమస్యల్లో పడినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మామిడి పండులో విటమిన్ ఏ విటమిన్ సి, ఐరన్ కాపర్ మెగ్నీషియం బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే మనలో చాలామంది మామిడిపండు తినే విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు కూడా వారికి తెలియదు. ముఖ్యంగా మామిడి పండు తిన్న తర్వాత చాలామంది మంచి నీటిని తాగుతుంటారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ విధంగా మామిడిపండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు రావడమే కాకుండా పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. మామిడిపండు తిన్న గంట తరువాత మంచి నీటిని తాగవచ్చు.

మామిడి పండ్లతో లేదా తర్వాత పెరుగు కూడా తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండూ కలిసి కడుపు సమస్యలు, జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. మామిడి పండ్లతో కలిపిన లేదా తిన్న స్పైసీ ఫుడ్ తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందుకే వాటిని ఎప్పుడూ కలిసి ఉండకూడదు. ఆయుర్వేదం ప్రకారం కాకరకాయ వంటి ఆహారాలను తిన్న తర్వాత కూడా మామిడికాయ, లేద పండ్లు తినటం వల్ల వికారం, వాంతులు వస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..