Uric Acid: హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వాముతో అద్భుత ఔషధం..! ఇలా వాడితే..

రీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే, మీ ఆహార అలవాట్లను మార్చుకోవటం మంచిది. అలాగే, కీళ్ల నొప్పులతో బాధపడేవారు వాము నుంచి తీసిన నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిముషాలు మసాజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

Uric Acid:  హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వాముతో అద్భుత ఔషధం..! ఇలా వాడితే..
Lemon Ajwain
Follow us

|

Updated on: May 04, 2024 | 7:58 AM

Ajwain: వాము.. ప్రతి ఒక్కరి వంటింట్లో వాములో ఎన్నో పోషక విలువలు,ఔషధ గుణాలు నిండి ఉంది. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాము రుచిలో కాస్త ఘాటుగా ఉంటుంది. వాములో ఉండే రసాయనాలు జీర్ణ ప్రక్రియలో సహాయపడతాయి. ప్రతి రోజు వామును తీసుకోవటం వలన మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఒక స్పూన్ వామును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు ఉన్నవారికి వాము ఒక దివ్య ఔషధం అంటున్నారు నిపుణులు. వాములో ఉన్న గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించటంలో సహాయపడుతుంది. జలుబు,అలసట,తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలకు మంచి పరిష్కారం అని ఆయుర్వేదం చెప్పుతుంది. అలాగే, యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో ఇబ్బంది పడేవారికి వాము, నిమ్మకాయతో చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

యూరిక్ యాసిడ్ అనేతా శరీరంలో పేరుకుపోయిన ఒక విష పదార్థం. ఇది ప్యూరిన్ ప్రోటీన్ల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే తీవ్ర సమస్యలు వస్తాయనే భయం ఉంటుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, యూరిక్ యాసిడ్ మొత్తాన్ని నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. నిమ్మరసంతో వాము కలిపి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

నిమ్మకాయ, వాము ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తారు . ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిమ్మ, వాములో ఉండే లక్షణాలు, పోషకాలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇది మూత్ర సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా వాముపొడి కలుపుకుని, ప్రతిరోజూ ఉదయం తాగితే ఫలితం ఉంటుంది.. అంతే కాకుండా నిమ్మరసం కలిపిన వాము టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు బరువు తగ్గడం, జీర్ణక్రియ సంబంధిత సమస్యల కోసం కూడా ఈ పానీయం తీసుకోవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే, మీ ఆహార అలవాట్లను మార్చుకోవటం మంచిది. అలాగే, కీళ్ల నొప్పులతో బాధపడేవారు వాము నుంచి తీసిన నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిముషాలు మసాజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles